World Nagasaki Day 2023: ఓ భయానక ఘట్టానికి 78 ఏళ్లు

World Nagasaki Day 2023: ఓ భయానక ఘట్టానికి 78 ఏళ్లు
X
ఆగస్టు 9 -ప్లుటోనియమ్ ఇంప్లోజన్ బాంబును నాగశాకి పై వేసిన రోజు

మానవ చరిత్రలో అతిపెద్ద మారణహోమాల్లో ఒకటి జపాన్‌ నగరం హిరోషిమాపై బాంబు దాడి. 1945 ఆగస్టు 6, 9తేదీల్లో ఇది జరిగింది. అంటే నేటికీ 78 ఏళ్లు. ఆగస్టు 6న హిరోషిమాపై, ఆగస్టు 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా జపాన్‌ పౌరులను బలితీసుకున్నాయి. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే.

పెరల్‌ హార్బర్‌పై దాడికి ప్రతీకారంగా జరిగిన అణు దాడులు జపాన్‌కు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చాయి.ఆ చేదు జ్ఞాపకాలు నేటికీ జపాన్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. పెరల్‌ హార్బర్‌పై 1941 డిసెంబర్‌ 7న జపాన్ దాడి చేయడంతో మొదలైంది రెండో ప్రపంచ యుద్ధం. అప్పటికే ఐరోపాలో విజయం సాధించిన జపాన్ కు అగ్రరాజ్యానికి లొంగిపోయేందుకు మనసు రాలేదు. కానీ కాలం గడిచేకొద్ది ఓటమి తప్పని స్థితికి వెళ్ళిపోయింది .


1945 ఆగస్టు ప్రారంభంలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబులు వేయడానికి అమెరికా నిర్ణయించుకుంది. తొలుత 1945 ఆగస్టు 6న హిరోషిమా నగరంపై లిటిల్‌ బాయ్‌ అనే అణ్వాయుధంతో అణుదాడి చేసింది. ఈ దాడిలో లక్షా 40వేల మంది మరణించారు. మరో మూడు రోజుల వ్యవధిలో ఆగస్టు ‍9న నాగసాకిపై ఫ్యాట్‌మ్యాన్‌ అనే మరో అణు బాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 70 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

1945 ఆగస్టు 9న మధ్యాహ్నం. జపాన్‌లోని మరో నగరం నాగసాకిలో బీ-29 బాంబర్లు రెండో ఆటం బాంబు జారవిడిచాయి. 43 సెకండ్లలో కిందకు చేరిన బాంబు విస్ఫోటనంతో చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ధ్వంసం అయిపోయాయి. క్షణాల్లో వేల మంది మనుషులు, జంతువులు గుర్తు తెలియకుండా మాడి మసైపోయాయి.


పేలుడు తీవ్రతకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల అద్దాలు కూడా ముక్కలైపోయాయి. విస్ఫోటనంతో ఏర్పడిన వేడి శరీరాలను కాల్చేసింది. నాగసాకిపై వేసిన బాంబుకు 'ఫ్యాట్ మ్యాన్' అనే కోడ్ ఉంది. ఇది 80,000 మందిని చంపింది. యుద్ధంలో జపాన్ బేషరతుగా లొంగిపోవడానికి కారణం అయ్యింది. పేలుడులో ఎంత మంది చనిపోయారో.. ఆ తర్వాత రేడియేషన్ సంబంధిత వ్యాధులతో కూడా అంతే మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇంతటి విషాదాన్ని నింపిన ఈరోజుని గుర్తుపెట్టుకోడానికి, నాగసాకి దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం శాంతిని పెంపొందించడానికి, అణ్వాయుధాల ముప్పు గురించి అవగాహన కల్పించడానికి మాత్రమే.

Tags

Next Story