Sunita Williams: నాసా మదిలో కల్పనా చావ్లా విషాదం

Sunita Williams: నాసా మదిలో కల్పనా చావ్లా విషాదం
X
అందుకే సునీతా విలియమ్స్‌ విషయంలో..

గతంలో ఏర్పడిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే నాసా వ్యోమగాములైన ఇండో అమెరికన్‌ సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ విల్‌మోర్‌లను ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉంచాల్సి వస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

2003లో భారత అమెరికన్‌ వ్యోమగామి కల్పనా చావ్లా, మరో ఆరుగురు స్పేస్‌షిప్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 1986లో కూడా స్పేస్‌ షటిల్‌ ఛాలెంజర్‌ పేలిపోవడంతో 14 మంది వ్యోమగాములు మరణించారు. ఈ రెండు ఘటనలు పునరావృతం కాకూడదనే ఆలస్యమైనప్పటికీ విలియమ్స్‌, మరొకరిని సురక్షితంగా వెనక్కి రప్పించాలని అంతరిక్ష కేంద్రంలోనే ఉంచేశారు.

‘ఈ రెండు ప్రమాదాలు మాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అందుకే ఐఎస్‌ఎస్‌ నుంచి సురక్షితంగా వారిద్దరినీ తీసుకురావడమే మా ప్రాధాన్యం’ అని నాసా చీఫ్‌ బిల్‌ నెల్సన్‌ తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించి నాసా కొన్ని తప్పులు చేసిందని అంగీకరించిన ఆయన, వైఫల్యాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

నాసా వారి గురించి ఎంతలా ఆలోచిస్తుందంటే.. స్టార్‌ లైనర్‌లో వారిని తీసుకొచ్చే సాహసం కూడా చేయడం లేదు. వారిద్దరి కోసం కోట్లు ఖర్చు చేసి మరో స్పెస్ షటిల్‌ను పంపేందుకు సిద్దమైంది. దీని కోసం స్పెస్‌ ఎక్స్‌తో చర్చలు జరుపుతోంది. స్పేస్‌ ఎక్స్‌ క్రూ-9 రాకెట్‌ను పంపనున్నారు. ఇది 2025 ఫిబ్రవరిలో వెళ్లనుంది. నిజానికి ప్రస్తుతం ISSలో ఓ స్పెస్‌ ఎక్స్‌కు చెందిన స్పెస్ షటిల్ పార్క్ చేసి ఉంది. సెప్టెంబర్‌లో ఇది భూమి మీదకు రిటర్న్ కానుంది. కానీ ముందుగానే ఇద్దరు రావడానికి సిద్ధమవడంతో సునీతాకు ఇందులో చోటు దక్కలేదు. ISSలో మరో స్పెస్‌ షటిల్ సూయాజ్ కూడా ఉంది. అయితే ఇందులో రష్యన్ ఆస్ట్రోనాట్స్‌ను ముందే రిజర్వ్ అయి ఉన్నారు. అందుకే ఫిబ్రవరిలో ప్లాన్‌ చేసిన ప్రయోగమే ఇప్పుడు దిక్కైంది. నిజానికి ఇందులో నలుగురు అస్ట్రోనాట్స్ వెళ్లాల్సి ఉంది.కానీ ఇప్పుడు సునీతా, విల్మోర్‌ కోసం ఇద్దరిని మాత్రమే పంపుతున్నారు. రిటర్న్ జర్నీలో నలుగురు తిరిగి రానున్నారు.

మరి బోయింగ్‌ స్టార్ లైనర్ పరిస్థితి ఏంటి? ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ నెక్స్ట్ వీక్ భూమి మీదకు తిరిగి రానుంది. ఇందులో ఎలాంటి క్రూ ఉండరు. ఇప్పటికే దీనికి ముహూర్తం ఫిక్స్‌ చేసింది నాసా..సెప్టెంబర్ ఆరు రోజున అన్‌డాక్‌ చేయనున్నారు. ఇది ఆరుగంటల ప్రయాణం తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్‌లో ల్యాండ్‌ కానుంది. స్పేస్‌ క్రాఫ్ట్‌ రిటర్న్‌ జర్నీ మొత్తం ఆటోమెటిక్‌గా జరగనుంది. ఈ ఆపరేషన్‌ మొత్తం ఫ్లోరిడా నుంచి కంట్రోల్ చేయనున్నారు. ఓవరాల్‌గా చూస్తే.. నాసా ప్రస్తుతం ఎలాంటి రిస్క్‌ తీసుకునే ఆలోచనలో లేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకోసం ఎన్ని నెలలైనా వెయిట్ చేసేందుకు రెడీ అవుతుంది తప్ప.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు.

Tags

Next Story