NASA : భూమిని చేరిన గ్రహశకలం నమూనా

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో ఈ నాసా క్యాప్సూల్ దిగింది.
విశ్వం ఆవిర్భావం, భూమి పుట్టకను తెలుసుకునేందుకు నాసా చేపట్టిన ఒసిరిస్ రెక్స్ మిషన్ చేపట్టింది. ఆస్టరాయిడ్ బెన్నూ అనే గ్రహశకలంపై దృష్టి సారించింది. దాని నమూనాలను సేకరించి, పరిశోధనలు చేపట్టేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా రెండేళ్ల కిందట ఆస్టరాయిడ్ బెన్నూపై డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించిన ఒసిరిస్- రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ 2021 మే 10న భూమికి తిరుగు ప్రయాణం కాగా.. ఆదివారం మిషన్‌లోని క్యాప్సూల్ అమెరికాలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని నాసా ధ్రువీకరించింది.
వాస్తవానికి నాసా భారీ ఆస్టరాయిడ్ 1999 సెప్టెంబర్ 11న తొలిసారి గుర్తించింది. ఇది కార్బోనేషియస్ గ్రహశకలం ఇది. ఈ గ్రహశకలం విస్తీర్ణం దాదాపు 565 మీటర్లు. సెకనుకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. దీని వేగాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఈజిప్ట్ మైథాలజీలో ఉన్న బెన్ను అనే పక్షి పేరును ఈ ఆస్టరాయిడ్‌కు పేరు పెట్టింది. 2018 డిసెంబర్ 3వ తేదీన ఒసిరిస్- రెక్స్ (Osiris-REx) అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు 3 ఏళ్లు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని ఈ స్పేస్‌క్రాఫ్ట్ చేరింది. మొత్తంగా మళ్లీ స్పేస్‌క్రాఫ్ట్ తిరిగి భూమిని చేరడానికి ఏడేళ్లు పట్టింది.
4.5 బిలియన్ సంవత్సరాల పురాతన గ్రహశకలంగా భావిస్తున్న నాసా.. భవిష్యత్‌లో ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. దాదాపుగా 2,182 సంవత్సరం సెప్టెంబర్‌లోనే ఈ బెన్ను ఆస్టరాయిడ్ భూమిని ఢీ ఛాన్స్ ఉందని భావిస్తున్నది. అందుకే ఈ గ్రహశకలంపై దృష్టి సారించి.. సమగ్ర అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. అందులో ఉండే ఖనిజాలు, ద్రవ్యరాశి, కక్ష్య, విస్తీర్ణం గురించి తెలుసుకోవాలని నిర్ణయించి, ఒసిరిస్- రెక్స్ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com