వికసించిన అంతరిక్ష కుసుమం

వికసించిన అంతరిక్ష కుసుమం
అసాధారణమైన పరిస్థితులలో పూసిన అందమైన పువ్వు

ఒక మొక్కకి ఒక పువ్వు పూసింది. ఆ విషయాన్ని పదిమందికి చెప్పి,పండగ చేసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంస్టాగ్రామ్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలలో ఆ పువ్వు కనపడని చోటే లేదు.. ఇంతకీ ఆ పువ్వుకు అంత ప్రాముఖ్యత ఎందుకో తెలుసా.. అది పూసింది ఎవరి పెరట్లోనో కాదు.

అంటరిక్షం లో..అంతరిక్షంలో జీవం ఉంటుందా? అక్కడ మనం బతకగలమా.. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పటివరకూ ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా నాసా అసలు స్పేస్‌ లో మొక్కలు పెరుగుతాయా? లేదా? అనే అంశంపై ద్రుష్టి పెట్టింది.. దాని ఫలితమే ఈ పువ్వు. స్పేస్‌లో పూసిన ఈ పువ్వు ఫోటోని రీసీంట్‌గా నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది జినియా అనే మొక్క నుంచి వికసించింది. ప్రస్తుతానికి ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

లైట్ ఆరెంజ్ కలర్ లో ఈ పువ్వు రేకులు అందంగా కనిపిస్తున్నాయి. బ్కాగ్రౌండ్ లో బ్లర్ గా కనిపిస్తున్న భూమిని కూడా ఈ ఫొటోలో చూడవచ్చు. ఈ పోస్ట్ కి తొమ్మిది లక్షల పైగా లైక్స్ వచ్చాయి. అద్భుతం అని, ఎంతో అందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.నిజానికి 2016 నుండి, ఈ ప్లాంట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అభివృద్ధి చెందుతోంది.అంతరిక్షంలో మొక్కలు అనే అంశం మీద 1970 నుంచిఅధ్యయనం చేస్తున్నారు. అయితే 2015లో కెజెల్ లిండ్ గ్రేన్ అనే వ్యోమగామి వెజ్జీ ప్రయోగం అంతరిక్షంలో మొక్కలు పెంచబడిన ప్రత్యేకంగా చేయబడింది.

ప్రస్తుత నేపథ్యంలో అంతరిక్షంలో మొక్కలను పెంచడం ఎందుకు అనే ప్రశ్న కూడా వస్తోంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి, చంద్రుడు మరియు అంగారక గ్రహాలకు భవిష్యత్తులో దీర్ఘ-కాల మిషన్ల సమయంలో వీటి అవసరం ఉంది. అంతేగాక వ్యోమగాములు దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల కోసం, వారి అవసరాలు తీర్చడానికి ఈ ప్రయోగం చాలా ఉపయోగ పడుతుంది. నిజానికి ప్యాక్ చేయబడిన ఆహారాలు వ్యోమగాముల లగేజ్ బరువు, దానిద్వారా వారు వెళ్లే వెహికల్ బరువు పెరగడానికి దారితీస్తాయి. వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాడైపోతాయి.

ప్యాక్ చేసిన ఆహారాలు విటమిన్ సి మరియు విటమిన్ కె లను తగ్గించేస్తాయి. కాబట్టి వ్యోమగాములు పోషకాహార అవసరాలను తీర్చడానికి ఆహార పంటలను అంతరిక్షంలో పండిస్తారు. ఇవి తగిన పోషకాలను వారికి అందించగలవు. జిన్నియాస్‌తో పాటు, నాసా వ్యోమగాములు స్టేషన్‌లో పాలకూర, టమోటాలు మరియు చిలీ పెప్పర్‌లను కూడా గతంలో విజయవంతంగా పెంచారు.

Tags

Read MoreRead Less
Next Story