National : భారత పర్యటనకు విచ్చేసిన ఆస్ట్రేలియా ప్రధాని

National : భారత పర్యటనకు విచ్చేసిన ఆస్ట్రేలియా ప్రధాని
మార్చి 8 నుంచి 11వరకు భారత్ లో పర్యటించనున్నారు. ఈ ఆరేళ్లలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మొదటిసారి భారత్ కు విచ్చేశారు

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు విచ్చేశారు. మార్చి 8 నుంచి 11వరకు భారత్ లో పర్యటించనున్నారు. ఈ ఆరేళ్లలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మొదటిసారి భారత్ కు విచ్చేశారు. ఈ పర్యటన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం మధ్య జరుగనుంది.

ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రితో పాటు, వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి సెనేటర్ డాన్ ఫారెల్, వనరుల మంత్రి, ఉత్తర ఆస్ట్రేలియా మాడెలిన్, సీనియర్ అధికారులు ఉన్నారు. భారత పర్యటనకు వచ్చే ముందు ఆస్ట్రేలియా ప్రధాని భారత్ కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు తాము భారత్ లోని న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. భారత్ తో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది మంచి సమయమని అన్నారు ఆంథోనీ.

భారత్, ఆస్ట్రేలియాలు క్లీన్ ఎనర్జీ రంగంలో సహకరించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. వీటితో పాటే మరిన్ని వ్యాపార లావాదేవీలకు ఈ భేటీ కేంద్రం కానుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ప్రధాని మోదీ కలిసి భారత్ - ఆస్ట్రేలియా ల మధ్య జరుగనున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ ను వీక్షించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story