Pakistan Elections: పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం.. నవాజ్ షరీఫ్, భుట్టో పొత్తు

Pakistan Elections:  పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం.. నవాజ్ షరీఫ్, భుట్టో పొత్తు
ప్రధాని ఎవరంటే ..

పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా జరుగుతోన్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ పార్టీ పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీతో జరిపిన చర్చలు ఫలించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు రాజకీయ అనిశ్చితి నుంచి పాకిస్థాన్‌ను రక్షించేందుకుఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు PML-N తెలిపినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ మద్దతుతో గెలిచిన ఓ స్వతంత్ర అభ్యర్థి PML-N పార్టీలో చేరారు.

గతకొద్ది రోజులుగా అనేక మలుపులు తిరుగుతోన్నపాకిస్థాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే పాక్‌లో జరిగినసార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలోసంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ - PML-N పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ -PPP, ముత్తహిదా ఖ్వామీ మూమెంట్‌- MQMలతో జరుపుతోన్నచర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.

PPP ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతోతమ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ జరిపిన చర్చల్లో చాలా అంశాలపై సఖ్యత కుదిరినట్లుPML-N ప్రకటించినట్లు అక్కడి మీడియా కథనాలుపేర్కొన్నాయి. అటు MQM పార్టీతో జరిపిన చర్చలు ఫలించినట్లు వెల్లడించాయి.రాజకీయ అనిశ్చితి నుంచి పాక్‌ను రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది అని కథనాల్లో రాసుకొచ్చాయి.


ప్రభుత్వ ఏర్పాటుకు తమతో కలిసి వచ్చే PPP, MQM పార్టీలకు అధ్యక్ష., నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌ పదవులతో పాటు పలు మంత్రి పదవులిచ్చేందుకు PML-N అంగీకరించినట్లు.. పాక్‌ మీడియా వెల్లడించింది. అయితే ప్రధాని పదవిని మాత్రం PML-N పార్టీ... తీసుకోనుందని తెలిపింది. త్వరలో జరగబోయే సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో PPP నాయకత్వం వారి ప్రతిపాదనలను తమ ముందు పెడుతుందని.. PML-N విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యావత్‌ దేశ పరిస్థితిని సమీక్షించి..... ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే భవిష్యత్‌లోరాజకీయ సహకారంపైనా వివరంగా చర్చించినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ పక్షానే నిలిచారని చెప్పుకొచ్చింది. PML-Nతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు PPP సైతం ధ్రువీకరించింది.


Tags

Read MoreRead Less
Next Story