Indian scientists: భార‌త సంత‌తి శాస్త్ర‌వేత్త‌ల‌కు అరుదైన గౌరవం.. అమెరికా సైంటిఫిక్ అవార్డు

Indian scientists:  భార‌త సంత‌తి శాస్త్ర‌వేత్త‌ల‌కు అరుదైన గౌరవం.. అమెరికా సైంటిఫిక్ అవార్డు
బైడెన్ చేతుల మీదుగా అమెరికా సైంటిఫిక్ అవార్డు

ఇద్ద‌రు భార‌తీయ సంత‌తి శాస్త్ర‌వేత్త‌ల‌కు అమెరికాలో అరుదైన గౌర‌వం ద‌క్కింది. అశోక్ గాడ్గిల్, సుబ్ర సురేష్ లకు ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బహూకరించారు. అమెరికాలో టెక్నాల‌జీ రంగంలో ఇచ్చే అత్యున్న‌త అవార్డు ఇది. మంగ‌ళ‌వారం రోజున ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరిగింది.

అశోక్ గాడ్గిల్ ప్ర‌స్తుతం కాలిఫోర్నియా వ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. లారెన్స్ బెర్కిలీ నేష‌న‌ల్ ల్యాబ్‌లో సీనియ‌ర్ సైంటిస్టుగా ఉన్నారు. సుస్థిర అభివృద్ధి రంగంలో ఆయ‌న ఆవిష్క‌క‌ర్త‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శుద్ధ నీరు, ఇంధ‌నం, శానిటేష‌న్ డెవ‌ల‌ప్మెంట్‌కు అవ‌స‌ర‌మైన స‌మ‌ర్థ సాంకేతిక విధానాల‌ను ఆయ‌న డెవ‌ల‌ప్ చేశారు. ముంబైలో జన్మించిన గాడ్గిల్ ముంబై వ‌ర్సిటీలో ఫిజిక్స్ చ‌దివారు. కాన్పూర్‌లో ఐఐటీ పీజీ చేశారు. బెర్కిలీలోని కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఎసీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రముఖ యుఎస్ ఆవిష్కర్తలకు ఇచ్చే ఈ పురస్కారం, అమెరికా పోటీతత్వం, జీవన నాణ్యతకు శాశ్వత సహకారం అందించిన వారిని గుర్తిస్తుంది. దేశ సాంకేతిక శ్రామిక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కాగా.. వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అందుకున్న 12 మందిలో గాడ్గిల్ ఒకరు.

మ‌రో శాస్త్ర‌వేత్త సుబ్రా సురేశ్‌.. అమెరికాలో బ‌యో ఇంజినీర్‌గా చేస్తున్నారు. గ‌తంలో మాసాచుసెట్స్ టెక్నాలిజీ ఇన్స్‌టిట్యూట్‌లో డీన్ గా చేశారు. ఇంజినీరింగ్‌, ఫిజిక‌ల్ సైన్సెస్‌, లైఫ్ సెన్సెస్‌, మెడిసిన్ రంగాల్లో ప‌రిశోధ‌న చేశారు. ఎంఐటీలో ఓ విభాగానికి అధిప‌తిగా ప‌నిచేసిన తొలి ఆసియా వ్య‌క్తిగా సురేశ్ రికార్డు క్రియేట్ చేశాడు. సైంటిస్టు స‌రేశ్ ముంబైలో జ‌న్మించారు. మ‌ద్రాసు ఐఐటీలో బీటెక్ చేశారు. ఐయోవా స్టేట్ వ‌ర్సిటీ నుంచి మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో మాస్ట‌ర్స్ చేశారు. ఎంఐటీ నుంచే పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.

శాస్త్ర సాంకేతిక రంగానికి అసాధార‌ణ రీతిలో సేవ‌లందించినందుకు ప్ర‌త్యేక గుర్తింపు అమెరికా ప్ర‌భుత్వం నేష‌న‌ల్ మెడ‌ల్ ఆఫ్ టెక్నాల‌జీ అవార్డుల‌ను అంద‌జేస్తుంది. శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో ఉన్న స‌వాళ్ల‌ను ఈ యోధుల‌ను ఎదుర్కొన్నార‌ని, ఇన్నోవేటివ్ విధానాల‌తో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించార‌ని అమెరికా స‌ర్కారు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Tags

Next Story