Nepal : సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ విడుదల!

Nepal
Nepal : సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ విడుదల!
బికినీ కిల్లర్ గా పేరుగాంచిన ఛార్లెస్ శోభరాజ్; అతడి విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్; 2003 నుంచి జైల్లోనే ఉన్న ఛార్లెస్

Nepal: ఛార్లెస్ శోభరాజ్.. 70ల్లో యావత్ ప్రపంచాన్ని వణికించిన ఈ సీరియల్ కిల్లర్ పేరు ఇప్పటికీ ప్రముఖంగా వినబడుతూనే ఉంటుంది. అయితే అరెస్ట్ అయిన 21ఏళ్ల తరువాత బికినీ కిల్లర్ గా పేరుగాంచిన ఇతని పేరు మరోసారి హెడ్ లైన్స్ కు ఎక్కింది. ఎందుకంటే 2003లో అరెస్ట్ అయిన ఛార్లెస్ తన శిక్షా కాలాన్ని ముగించుకుని విడుదలవ్వబోతున్నాట.


ఫ్రెంచ్ పౌరసత్వం కలిగిన ఛార్సెస్ కు భారత్, వియత్నం మూలాలున్నాయి. దక్షిణాసియాలో సుమారు 20కు పైగా హత్యలకు పాల్పడ్డ ఛార్లెస్ పై థాయ్‌లాండ్‌ లో మరో 14 హత్యలు చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. ఈమేరకు 1976లో భారత్ లో అరెస్ట్ అయిన ఈ సీరియల్ కిల్లర్ మరుసటి ఏడాదే విడుదలయ్యాడు. అనంతరం పారిస్ వెళ్లిపోయిన ఛార్లెస్ 2003లో నేపాల్ కు రావడంతో మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి జీవిత ఖైదు పొందిన ఛార్లెస్ అప్పటినుంచి జైల్లోనే మగ్గుతున్నాడు.


అందంగా, హుందాగా కనిపించే ఛార్లెస్ తన మాటకారితనంతో ఎందరో టూరిస్ట్ లను లూటీ చేసి హత్య చేశాడు. అతడి చేతిలో ప్రాణాలు వదలిన వారందరూ దాదాపూ బికినీల్లోనే హత్యకు గురవ్వడంతో 'బికినీ కిల్లర్' అనే పేరు గడించాడు.


ప్రస్తుతం ఖాట్మండు సెంట్రల్ జైల్లో ఉన్న ఛార్లెస్ 21ఏళ్ల తరువాత మళ్లీ జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడి వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని విడుదలకు అదేశాలు జారీ చేసింది నేపాల్ ప్రభుత్వం. అయితే విడుదలైన 15రోజుల్లోగా అతడు దేశాన్ని విడిచి వెళ్లాలని అదేశించింది.


అరెస్ట్ అయిన తరువాత కూడా ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయని ఛార్లెస్ తనని తాను ఓ సెలబ్రిటీగా భావించుకునేవాడు. ఇతడిపై నాలుగు బయోగ్రఫీలు విడుదలవ్వగా 'ఛార్లెస్ ఔర్ మేఁ' అనే హిందీ సినిమా కూడా విడుదలైంది. గతేడాది 'ది సర్పెంట్' అనే 8ఎపిసోడ్ల వెబ్ సిరీస్ సైతం విడుదలైంది. ఇది ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.



Tags

Read MoreRead Less
Next Story