Nepal Flight : "మానవ తప్పిదం వల్లే విమానం కూలిపోయింది"

గత నెలలో నేపాల్ కు చెందిన యెతి ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులు సహా 71మంది మరణించారు. ఈ ప్రమాదంపై ప్రథమిక దర్యాప్తు పూర్తయింది. విమానం కూలిన ఘటనలో మానవ తప్పిదం ఉన్నట్లు ప్రాథమిక నిర్థారణలో తేలింది. జనవరి 15న ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన యెతి 691, సేతీ నది కొండగట్టుపై కూలిపోయింది.
విమానం కూలినప్పుడు అందులో సిబ్బందితో సహా 72మంది ఉన్నారు. రెస్యూ చేయగా 71మృతదేహాలను స్వాధీనం చేసుకోగలిగారు. తప్పిపోయిన ప్రయాణికుడు చనిపోయినట్లుగా ప్రకటించారు. రెండు ఇంజన్ల ప్రొపెల్లర్లు రెక్కలు ఉన్న స్థానానికి రావడం చాలా అరుదని ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీలోని ఒకరు తెలిపారు. పర్యాటక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన 14పేజీల ప్రాథమిక నివేదికలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది.
విమానం క్రాష్ అయినప్పుడు ఆకాశం క్లియర్ గా ఉందని నివేధికలో పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పైలట్ లు అనుకోకుండా కండిషన్ లివర్ ను లాగడం వలన ఇంజన్ ఆగిపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రతీ లివర్ ద్వారా ఇంధన సరఫరా జరపవచ్చని, ఆపవచ్చని తెలిపారు. క్రాష్ అవుతున్నప్పుడు మీటలు కిందికి లాగబడి ఉన్నాయని చెప్పారు. ఇంధనాన్ని ఆపడం వలన ఫ్లైట్ క్రాష్ అయినట్లు అనుమానిస్తున్నారు.
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రకారం.. ప్రమాదం జరిగిన 30 రోజులలోపు ప్రాథమిక నివేదికను అందిచాలి. 12నెలల్లో చివరి నివేదికను పంపించాలి. ప్రస్తుతం పాథమిక నివేదిక రెడీ అయినట్లు నేపాల్ విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com