Nepal Flight accident : కో-పైలెట్ దంపతుల విషాద గాథ

కో-పైలెట్ గా విధులు నిర్వర్తిస్తూ భర్త ప్రాణాలు విడిచాడు. కొన్నేళ్ల తరువాత భార్య కూడా అదే రంగాన్ని ఎంచుకుని కోపైలెట్ గా ఉద్యోగం సాధించింది. తాజాగా నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఆవిడ కూడా అదే రీతిన ప్రాణాలు వదిలించి. ఆ కోపైలెట్ పేరు అంజు ఖటివాడా. కొద్దిగంటల్లో పైలెట్ కావాలన్న తన లక్ష్యం నెరవేరుతుందన్న సమయంలో విమాన ప్రమాదం సంభవించి ఆమె ప్రాణాలు కబళించింది. ప్రమాదానికి గురైన ATR - 72 అనే విమానాన్ని, సీనియర్ కెస్టెన్ కమల్ కేసీ పైలెట్ గా, అంజు ఖటివాడా కో పైలెట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
పైలెట్ గా ప్రమోషన్ దక్కాలంటే నేపాల్ నిబంధనల ప్రకారం... కో పైలెట్ గా ఉన్నవారు 100 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉండాలి. ఆదివారం నాటి విమానం సేఫ్ గా ల్యాండ్ అయి వుంటే అంజు ఖటివాడాకు 100 గంటల టార్గెట్ పూర్తై పైలెట్ గా ప్రమోషన్ కూడా వచ్చేదే. కానీ, ఇంతలోనే విధి వెక్కిరించి ఆమె కల, కలగానే మిగిలిపోయింది. అంజూ భర్త విమాన ప్రమాదంలో చనిపోగా ఇప్పుడు ఆమె కూడా అలాంటి ఘటనలోనే ప్రాణాలు విడిచింది.
ఫేస్ బుక్ లో లైవ్ పెట్టిన వ్యక్తి మొక్కుతీర్చుకోడానికి వెళ్లాడు....
విమానం ప్రమాదానికి గురవుతుండగా ఫేస్ బుక్ లైవ్ ద్వారా అక్కడి అందాలను చూపెడుతున్న సోనూ జైస్వాల్, నేపాల్ లోని పశుపతి నాథ్ ఆలయానికి మొక్కుతీర్చుకోడానికి వెళ్లాడు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సోనూ జైస్వాల్ కొడుకు పుడితే పశుపతి నాథ్ మందిరానికి వస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లుగానే ఇద్దరు కూతుర్ల తరువాత అతనికి కొడుకు పుట్టాడు. ఆయన కోరిక తీరగా... ముగ్గురు స్నేహితులతో కలిసి నేపాల్ కు వెళ్లారు. పశుపతి నాథ్ దర్శనం అనంతరం, అక్కడున్న పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్లగా, విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సోనూ ఫోన్ లో రికార్డ్ అయిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com