నేపాల్ విమాన ప్రమాదం.. 18 మంది ప్రయాణీకులు మృతి

నేపాల్ లో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సౌర్య ఎయిర్‌లైన్స్ లో విమాన ప్రమాదం తర్వాత దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. దాంతో విమానాశ్రయం మూసివేయబడింది.
పోఖారాకు వెళ్లే విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని నేపాలీ న్యూస్ వెబ్‌సైట్ ఖాట్మండు పోస్ట్ పేర్కొంది. ప్రమాద స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ఇప్పటివరకు మొత్తం 18 మంది సిబ్బంది మరియు ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశారు. విమానం పైలట్ కెప్టెన్ మనీష్ షాక్యా (37)ను రక్షించి సినమంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు.
దక్షిణాసియా కాలమానం ప్రకారం, టేకాఫ్ సమయంలో విమానం రన్‌వేపై నుంచి జారిపడి కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు, ప్రాణాల కోసం గాలిస్తున్నారు. మిత్సుబిషి CRJ-200ER అయిన సౌర్య అర్లైన్స్ విమానం 9N-AME, కొంతమంది సాంకేతిక సిబ్బందిని కూడా తీసుకువెళుతున్నట్లు ది హిమాలయన్ టైమ్స్ నివేదించింది.
రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్‌కు ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ ఖాట్మండు పోస్ట్ పేర్కొంది. టేకాఫ్ సమయంలొో రెక్కల కొన భూమిని తాకింది, ఫలితంగా విమానంలో మంటలు వ్యాపించి కూలిపోయింది. ఆ తర్వాత రన్‌వేకు తూర్పు వైపున ఉన్న లోయలో పడిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com