Nepal Plane Crash: వద్దన్నా వినకుండా వెళ్లింది.. ప్రాణాలు కోల్పోయింది.. : కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు

Nepal Plane Crash: వద్దన్నా వినకుండా వెళ్లింది.. ప్రాణాలు కోల్పోయింది.. : కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
Nepal Plane Crash: నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో ఓషిన్ అలే మగర్ అనే 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ విషాదకరంగా మరణించారు.

Nepal Plane Crash: నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో ఓషిన్ అలే మగర్ అనే 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ విషాదకరంగా మరణించారు. మాఘే సంక్రాంతి పండుగను తన కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి ఇంటికి తిరిగి వస్తానని ఆమె హామీ ఇచ్చింది. కానీ అంతలోనే శవమైంది. 72 మంది ప్రయాణీకులతో సహా యతి ఎయిర్‌లైన్స్ యొక్క 9N-ANC ATR-72 విమానం యొక్క విషాద ప్రమాదంలో ఆమె మరణించినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు ధృవీకరించారు. ఐదుగురు భారతీయులు, రిసార్ట్ సిటీ పోఖారాలోని సేతీ నది ఒడ్డున కుప్ప కూలిన విమానంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 69 మందిలో ఓషిన్ కూడా ఉన్నారు.



ఓషిన్ అలే మగర్ కుటుంబం మాఘే సంక్రాంతి పండుగను ఇంట్లో జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, విమానం కూలిపోయిందనే వార్త వారికి అందింది. ఆమె తండ్రి, మోహన్ అలె మగర్, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. పండుగ రోజున పనికి వెళ్లవద్దని కూతురికి ఉదయాన్నే చెప్పారు. అయితే ఆమె ముందు డ్యూటీ తరువాతే పండుగ అని చెప్పి వెళ్లింది. ఒషిన్ రెండు సంవత్సరాలుగా యతి ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తోంది.




వాస్తవానికి ఆమె స్వస్ధలం చిత్వాన్‌లోని మాడి. ఉద్యోగంలో జాయిన్ అయిన తరువాత కుటుంబంతో కలిసి ఖాట్మండులో నివసిస్తున్నారు. గత ఆరు నెలలుగా రాజధానిలో తనతో ఉండమని ఇటీవల తన తల్లిదండ్రులను ఆహ్వానించింది. ఒషిన్‌కు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు, ఆమె నలుగురు తోబుట్టువులలో పెద్ద కుమార్తె. ఆమె సోదరుడి వయస్సు కేవలం నాలుగేళ్లు. వాళ్ల చదువుల కోసమని ఆమె ఖాట్మండులో ఉందామని చెప్పింది తల్లిదండ్రులతో.



ఆమె గైండకోట్ (నేపాల్)లోని ఆక్స్‌ఫర్డ్ కాలేజీలో చదువుకుంది. ఖాట్మండులోని సహారా ఎయిర్ హోస్టెస్ అకాడమీ నుండి ఎయిర్ హోస్టెస్‌గా పట్టభద్రురాలైంది. ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం కాగా, భర్త ప్రస్తుతం యూకేలో ఉన్నారు. కుమార్తె మృతదేహాన్ని గుర్తించేందుకు ఆమె తండ్రి మోహన్, తల్లి సబ్నం అలే మగర్ పోఖారా చేరుకున్నారు.



యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9N-ANC ATR-72 విమానం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 10:33 గంటలకు బయలుదేరింది. ల్యాండింగ్ చేయడానికి నిమిషాల ముందు పాత విమానాశ్రయం మరియు కొత్త విమానాశ్రయం మధ్య ఉన్న సేతీ నది ఒడ్డున కూలిపోయింది. నేపాల్ (CAAN). విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరంతో సహా ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలలో ఎనిమిదింటికి నిలయమైన నేపాల్ విమాన ప్రమాదాల చరిత్రను కలిగి ఉంది.



1992లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం ఖాట్మండులో ల్యాండ్ కావడానికి ప్రయత్నించి కొండపై కూలి 167 మంది మరణించిన తర్వాత ఆదివారం నాటి ప్రమాదం నేపాల్‌లో అత్యంత ఘోరమైనది.

Tags

Read MoreRead Less
Next Story