Nepal: ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ వెనకాల హిందూ రాజు చిత్రపటం..

నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత నిర్వహించి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అనేక మంది మంత్రులు కూడా రాజీనామాలు సమర్పించారు. గత కొన్నేళ్లుగా అవినీతి, బంధు ప్రీతితో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం, నేపాల్‌లో శాంతిభద్రత పరిస్థితులను ఆర్మీ చేతుల్లోకి తీసుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఒక సన్నివేశం అందరిలో ఆసక్తి పెంచింది. నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేత్ దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో, ఆయన వెనక ‘‘హిందూ రాజు’’ పృథ్వీ నారాయణ్ షా చిత్రపటం ఉండటం అందరిలో ఆసక్తి పెంచింది. నేపాల్‌లో 239 ఏళ్ల ‘‘రాచరిక’’ పాలనకు 2008తో అంతమైంది. ఆ తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడింది. 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంటే, ఆ దేశంలో ఎంత అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఆ దేశంలో రాజు పాలన రావాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు.
తాజాగా, ఆర్మీ చీఫ్ వెనకాల ఈ ఫోటో ఉండటం చూస్తే, క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నేపాల్ రాజకీయాల్లో దీనిని ‘‘బిగ్ డెవలప్మెంట్’’గా నెటిజన్లు చెబుతున్నారు. దీనిని అతిపెద్ద ప్రకటనగా అభివర్ణిస్తున్నారు. అయితే, రాజు పృథ్వీ నారాయణ్ షాకు సైన్యంతో చాలా అనుబంధం ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు, సంస్థలు, సైనిక మౌలిక సదుపాయాలు ఈయన పేరుతో ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2024లో సిగ్దేల్ నేపాల్ సైన్యం బాధ్యతలు తీసుకునే సమయంలో కూడా ఆయన వెనక పృథ్వీ నారాయణ్ షా ఫోటో ఉంది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో రాచరికం రావాలని పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. మాజీ మావోయిస్టు గెరిల్లా దుర్గా ప్రసాయి రాచరికం రావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా నిరసనలకు ఆయన మద్దతు ప్రకటించారు.
ఎవరీ పృథ్వీ నారయణ్ షా ..?
గూర్ఖా రాజ్యంలో జన్మించిన పృథ్వీ నారాయణ్ షా (1723–1775), 20 సంవత్సరాల వయస్సులో సింహాసనాన్ని అధిష్టించి ఆధునిక నేపాల్‌కు రూపశిల్పి అయ్యాడు.రాజ్‌పుత్ మూలానికి చెందిన ఈయన 50కు పైగా విచ్ఛిన్నమైన రాజ్యాలను ఏకం చేశారు. 1744లో టిబెట్‌కు కీలకమైన వాణిజ్య మార్గమైన సువాకోట్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆయన పోరాటాలు ప్రారంభమయ్యాయి. 1769లో ఖాట్మాండు లోయలోని ముల్లా రాజ్యాలైన ఖాట్మాండు, పటాన్, భక్తపూర్‌లను స్వాధీనం చేసుకోవడంతో ముగిశాయి. పృథ్వీ నారాయణ షా నేపాల్ ఏకీకరణను అమెరికా సంయుక్త రాష్ట్రాలనున రూపొందించిన జార్జ్ వాషింగ్టన్‌తో పోలుస్తారు.
షా నేపాల్ సైన్యానికి పునాది వేశారు. ఆయన గూర్ఖా దళాలకు శిక్షణ, కొండప్రాంతాల్లో గెరిల్లా వ్యూహాలను ప్రవేశపెట్టారు. 1762 నాటికి ఆయన శ్రీనాథ్ కాళి అనే బెటాలియన్‌ను ఏర్పాటు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com