Netanyahu : న్యూయార్క్ టూర్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు,అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ హెచ్చరిక

Netanyahu : న్యూయార్క్ టూర్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు,అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ హెచ్చరిక
X
ఇంకా బాధ్యతలు చేపట్టని మమ్దానీ ఆదేశాలపై సందిగ్ధత

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు జారీ చేశారు. నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు ఎదుర్కొంటున్న నాయకులపై అరెస్ట్ వారెంట్లను అమలు చేయడానికి న్యూయార్క్ పోలీసు విభాగాన్ని పంపుతానని మమ్దానీ ప్రతిజ్ఞ చేశారు. అయితే నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ ఉంది. ఈ నేపథ్యంలో నెతన్యాహును అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ బెదిరించారు. అయితే తాను న్యూయార్క్ సందర్శించి తీరుతాని నెతన్యాహు తేల్చి చెప్పారు.

మమ్దానీతో మాట్లాడతారా? అని నెతన్యాహును విలేకరి ప్రశ్నించగా.. దానికి సమాధానంగా అతను మనసు మార్చుకుని వస్తే సంభాషణ ఉంటుందని చెప్పారు. న్యూయార్క్‌లో ఇజ్రాయెల్ ఉనికి ఉంటుందని తెలిపారు.

న్యూయార్క్‌లోనే ఎక్కువగా యూదు జనాభా ఉంటుంది. అలాగే ఐక్యరాజ్యసమితి కూడా ఇక్కడే ఉంది. ఐక్యరాజ్యసమితిలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశాలకు నెతన్యాహు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. అయితే ప్రస్తుతం నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్నారు. అరెస్ట్ హెచ్చరికల నేపథ్యంలో ఇంకా బాధ్యతలు చేపట్టని మమ్దానీకి ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మమ్దానీ జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంతలోనే నెతన్యాహును అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ బెదిరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.

Tags

Next Story