CAA: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ, 3 క్రిమినల్ చట్టాల నోటిఫై

CAA: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ, 3 క్రిమినల్ చట్టాల నోటిఫై
X
26లోగా నోటిఫై ఏడాదిలోగా అమలు

ఇటీవల చట్ట సభల్లో ఆమోదం పొందిన మూడు క్రిమినల్‌ చట్టాల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మూడు క్రిమినల్‌ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ)లను ఈ నెల 26లోగా నోటిఫై చేసి, ఏడాదిలోగా దేశమంతా అమలు చేస్తారని ఒక ఉన్నతాధికారి మంగళవారం తెలిపారు.

ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం తెలుపగా, డిసెంబర్‌ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మూడు చట్టాలు నోటిఫై చేసిన తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ అధికారులు, దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్‌ విభాగాల వారికి శిక్షణ ఇస్తారు.


3 క్రిమినల్ చట్టాలు..

వలసపాలకుల నాటి క్రిమినల్ చట్టాలు ఐపీసీ, సీసీపీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానే మూడు బిల్లులను కేంద్రం ఇటీవల తీసుకువచ్చింది. గత డిసెంబర్ 21న ఈ మూడు బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సైతం ఆమోదముద్ర వేశారు. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేళ్లు, అంతకు పైబడి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సెక్ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నారు.

సీఏఏ చట్టం కింద 2014 డిసెంబర్ 31 వరకూ బంగ్లాదేశ్, పాకిస్థా్న్, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీలు, క్రిస్టియన్లకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. 2019 డిసెంబర్‌లో సీసీఏను పార్లమెంటు ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు. పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, పోలీసు చర్యల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2020 నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలు రూపొందిస్తోందనే కారణంగా హోం శాఖ ఎప్పటికప్పుడు నిబంధనల నోటిఫై చేయడాన్ని పొడిగిస్తూ వస్తోంది.


Tags

Next Story