Candida Auris: కలవరం రేపుతున్న క్యాండిడా ఆరిస్ ..

అత్యంత ప్రమాదకర ఫంగల్ వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో వేగంగా వ్యాపిస్తోంది. జనవరి నెలలో వాషింగ్టన్ రాష్ట్రంలో నలుగురు వ్యక్తులకు ‘క్యాండిడా ఆరిస్’ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇన్ఫెక్షన్ అరుదైనదే అయినప్పటికీ అత్యంత హానికరమైనదని వైద్య నిపుణులు హెచ్చరించారు. మరణాల రేటు అధికమని, దీని చికిత్సలో ఔషధాల ప్రభావం తక్కువగా ఉండడం, వైద్యవ్యవస్థ సౌకర్యాల ద్వారా సులభంగా వ్యాప్తి చెందగల లక్షణాలు ఉండడంతో ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదకరమని వైద్య నిపుణులు అప్రమత్తత ప్రకటించారు.
ఈ ఏడాది ‘క్యాండిడా ఆరిస్’ మొదటి కేసు జనవరి 10న నిర్ధారణ అయ్యింది. గతవారం మూడు కేసులు పాజిటివ్‌గా తేలినట్టు ‘సియాటెల్ అండ్ కింగ్ కౌంటీ’ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గత మంగళవారం ప్రకటించింది. ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులకు సోకుతోందని, పలు ప్రభావవంత యాంటీ ఫంగల్ మందులు దీని చికిత్సలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాని వైద్య నిపుణులు చెబుతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.
హాస్పిటల్స్‌లో ఫీడింగ్ ట్యూబ్‌లు, బ్రీతింగ్ ట్యూబ్‌లు ఉపయోగించే రోగులకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్టు గుర్తించారు. శరీరంలో రక్తప్రవాహం, గాయాలు, చెవులు వంటి వివిధ శరీర భాగాలలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని అమెరికా హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) రిపోర్ట్ పేర్కొంది. సోకిన ప్రదేశాన్ని బట్టి తీవ్ర ఉంటోందని వివరించింది.
కాగా 15 సంవత్సరాల క్రితం జపాన్‌లో ‘కాండిడా ఆరిస్’ కేసులు తొలిసారి నమోదయాయి. ఆ తర్వాతి కాలంలో అవి విపరీతంగా పెరిగిపోయాయి. 2016లో 53 మందికి, 2021లో 1,471 మందికి, 2022లో 2,377 మందికి ఈ ఫంగస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కేసు నమోదయాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఈ ఫంగస్‌ను పెరుగుతున్న ముప్పుగా గుర్తించింది.
క్యాండిడా ఆరిస్ ఇన్ఫెక్షన్‌లు వేగంగా విస్తరించడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా సాయం చేస్తున్నాయని 2019లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. క్యాండిడా ఆరిస్ (సి. ఆరిస్) అనేది ఫంగస్ వర్గానికి చెందిన ఒక ఈస్ట్. నిజానికి ఇలాంటి ఫంగస్‌లు రొట్టెలు, బీర్‌ల తయారీలో ఉపయోగపడుతుంటాయి. అదే సమయంలో వీటిలో కొన్ని మనుషుల్లో ఇన్ఫెక్షన్లకు కూడా కారణం అవుతుంటాయి.
తరచూ కనిపించే ఇలాంటి ఇన్ఫెక్షన్లలో క్యాండిడా ఆల్బికన్స్ కూడా ఒకటి. దీని వల్ల థ్రష్ లాంటి నోటి ఇన్ఫెక్షన్‌లు వస్తాయి. అయితే, ఒక్కోసారి ఇవి తీవ్రంగా కూడా మారుతుంటాయి. సి. ఆరిస్‌ను తొలిసారిగా 2009లో టోక్యో మెట్రోపాలిటన్ జేరియాట్రిక్ హాస్పిటల్‌లోని ఒక రోగి చెవిలో వైద్యులు గుర్తించారు. అందుకే దీని పేరులోనూ ఆరిస్ అనే పదం కనిపిస్తుంది. దీనికి లాటిన్‌లో చెవి అనే అర్థముంది. క్యాండిడా ఈస్ట్‌లు మన చర్మంపై కనిపిస్తుంటాయి. సాధారణంగా వీటి వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ, మనం ఏదైనా అనారోగ్యానికి గురైనా లేదా రక్త ప్రవాహం, ఊపిరితిత్తుల్లోకి ఇవి ప్రవేశించినా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com