IHU Variant: ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్‌.. ఒమిక్రాన్‌ కంటే ఎక్కువగా

IHU Variant: ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్‌.. ఒమిక్రాన్‌ కంటే ఎక్కువగా
IHU Variant: ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. రికార్డు స్థాయిలో పలుదేశాలలో కేసులు నమోదు అవుతున్నాయి.

IHU Variant: ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. రికార్డు స్థాయిలో పలుదేశాలలో కేసులు నమోదు అవుతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు చాలా దేశాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్ భయపెడుతున్న క్రమంలో తాజాగా మరో కొత్తరకం వేరియంట్‌ వెలుగు చూసింది. అయితే ఇది ఒమిక్రాన్‌ కంటే ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు తేలడం ఇప్పుడు ఆందోళనకి గురిచేస్తోంది.

కొత్తగా వెలుగు చూసిన ఈ వేరియంట్‌ను IHU (B.1.640.2) రకంగా పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.. ఇందులో దాదాపు 46 మ్యుటేషన్లు జరిగినట్లు గుర్తించారు. ఫ్రాన్స్ లో ఇప్పటికే 12 కేసులు కూడా నమోదయ్యాయి. ఆఫ్రికాలోని కామెరూన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే ఈ వేరియంట్‌ బయటపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

అయితే వ్యాక్సిన్‌లపై ఈ కొత్త వేరియంట్‌ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పడం తొందరపాటే అవుతుందని ఫ్రాన్స్‌ నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, ఇలాంటివన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

గత ఏడాది నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కనుగొనబడింది. ఇది ఇప్పుడు 100 కంటే ఎక్కువ దేశాలకు వ్యాపించింది. భారత్ లో ఇప్పటికి 1,900 మందికి ఒమిక్రాన్ సోకింది.

Tags

Next Story