Zohran Mamdani: పాతకాలపు దుస్తుల్లో మెరిసిన న్యూయార్క్ మేయర్ దంపతులు

Zohran Mamdani:  పాతకాలపు దుస్తుల్లో మెరిసిన న్యూయార్క్ మేయర్ దంపతులు
X
సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దుస్తులు

న్యూయార్క్ మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి ముస్లిం మేయర్‌గా ప్రమాణం చేశారు. గతేడాది జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.

గురువారం న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ప్రమాణం చేశారు. భార్య రమా దువాజీ రెండు ఖురాన్లు చేతితో పట్టుకోగా.. మమ్దానీ చేయి వేసి ప్రమాణం చేశారు. అయితే ఈ సందర్భంగా భార్యాభర్తలు వేసుకున్న దుస్తులు హైలెట్‌గా నిలిచాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చ నడుస్తోంది.

వింటర్ సీజన్‌కు తగ్గట్టుగా మమ్దానీ ఫ్యాషన్ డ్రస్‌ను ధరించారు. హెరింగ్బోన్ నెక్‌టై ఉన్న సూట్‌ను ధరించారు. ఇక ఈ సూట్‌ను ఢిల్లీకి చెందిన డిజైనర్ కార్తీక్ కుమ్రా రూపొందించారు. కార్తీక్ కుమ్రా లేబుల్ కార్తీక్ రీసెర్చ్ రూపొందించింది. ప్రత్యేకంగా ‘టై’ను అస్సాం నుంచి వచ్చిన ఎరి సిల్క్ ఫాబ్రిక్ నుంచి కత్తిరించారు. నాలుగు రేకుల పువ్వులతో ఎంబ్రాయిడరీ చేశారు. ఇక భార్య రామ దువాజీ పాతకాలపు ఫ్యాషన్ గుర్తుచేసేలా రూపొందించారు. కరేఫా-జాన్సన్ శైలిలో దువాజీ తన దుస్తులతో చాలా పాతకాలపు ష్యాషన్‌ను గుర్తుచేసింది. నల్లటి వింటేజ్ బాలెన్సియాగా కోటు, ది ఫ్రాంకీ షాప్ నుంచి కులోట్-స్టైల్ షార్ట్స్, మిస్టా లేబుల్ నుంచి ఒక జత జెన్ Z కూల్ బూట్లను ధరించింది. న్యూయార్క్ వింటేజ్ నుంచి షాన్డిలియర్-స్టైల్ చంకీ బంగారు చెవిపోగులు, బంగారు బ్రాస్లెట్లు ధరించారు. సంప్రదాయం మరియు సంస్కృతిని గుర్తుచేసేలా కనిపించారు.

ఇక సిటీ హాల్ వెలుపల జరిగిన కార్యక్రమానికి దువాజీ పాలస్తీనియన్-లెబనీస్ డిజైనర్ సింథియా మెర్హెజ్ తయారు చేసిన బ్రౌన్ ఫన్నెల్-నెక్ కోటును ధరించారు. గోధుమ రంగులో హై-హీల్డ్ లేస్-అప్‌లుగా ఉన్నాయి.

Tags

Next Story