19 Jan 2023 8:34 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / New Zealand: ప్రధాని...

New Zealand: ప్రధాని షాకింగ్ డెసిషన్.. పదవికి రాజీనామా

New Zealand: న్యూజిలాండ్ ప్రధాన మంత్రి, ప్రగతిశీల రాజకీయాలకు గ్లోబల్ హెడ్ అయిన జెసిండా ఆర్డెర్న్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు.

New Zealand: ప్రధాని షాకింగ్ డెసిషన్.. పదవికి రాజీనామా
X

New Zealand: న్యూజిలాండ్ ప్రధాన మంత్రి, ప్రగతిశీల రాజకీయాలకు గ్లోబల్ హెడ్ అయిన జెసిండా ఆర్డెర్న్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. 42 ఏళ్ల జెసిండా- ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో దేశాధినేతగా ఆమె వ్యవహరించిన తీరు దేశ ప్రజలకు చేరువ చేసింది.



"నేను కూడా మనిషినే. చేయగలిగినంత కాలం చేస్తాము.. నా శక్తి మేర నేను దేశానికి ఇవ్వగలిగినంత ఇచ్చాను. ఆపై ఇది నేను నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అని తన లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో అన్నారు. జెసిండా ఫిబ్రవరి 7 లోపు పదవీవిరమణ చేస్తానని చెప్పారు.



పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణంగా జెస్సిండా ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందన్న విషయం గ్రహించి తనకు తానుగా గౌరవంగా తప్పుకోవాలని భావించారు. "ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత విశేషమైన పని అని నేను నమ్ముతున్నాను. కానీ అది మరింత సవాలుతో కూడుకున్నది" అని జెసిండా తెలిపారు.



"మీకు పూర్తి నమ్మకం ఉంటే తప్ప మీరు ఈ బాధ్యతను నిర్వర్తించలేరు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2019 క్రైస్ట్‌చర్చ్ మసీదు మారణకాండలో 51 మంది ముస్లిం ఆరాధకులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ప్రధాని జెసిండా స్పందించిన తీరుకు అంతర్జాతీయ ప్రశంసలు పొందారు.



ఆ తరువాత ఆమె ప్రాణాంతకమైన వైట్ ఐలాండ్ అగ్నిపర్వతం విస్ఫోటనం సమయంలో ఆమె నిర్ణయాత్మక నాయకత్వానికి ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 14న జరిగే సాధారణ ఎన్నికల్లో న్యూజిలాండ్ తదుపరి ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నట్లు ఆర్డెర్న్ ప్రకటించారు.



అప్పటి వరకు నియోజక వర్గ ఎంపీగా కొనసాగుతానని ఆమె తెలిపారు. ఆమె నిష్క్రమణ లేబర్ పార్టీలో శూన్యతను మిగిల్చింది. వచ్చే ఎన్నికల్లో మనం గెలవలేమని నమ్మడం వల్ల నేను వెళ్లడం లేదు. మనం గెలుస్తామని నేను నమ్ముతున్నాను అని తమ లేబర్ పార్టీ అధినేతలను ఉద్దేశించి అన్నారు. 1990లో పాకిస్థాన్‌కు చెందిన బెనజీర్ భుట్టో తర్వాత పదవిలో ఉండగానే తప్పుకున్న ప్రపంచంలో రెండవ ప్రధానమంత్రి జెసిండా.



పాఠశాల విద్యను అభ్యసించబోతున్న తన కుమార్తె నీవ్‌తో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్న తెలిపారు. తన భాగస్వామి, టీవీ వ్యక్తి క్లార్క్ గేఫోర్డ్‌ను వివాహం చేసుకోవడానికి తాను ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు.

Next Story