ఆ దేశంలో నవారు మంచం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఆ దేశంలో నవారు మంచం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
New Zealand: దేశంలోని పలు ప్రాంతాల్లో నవారు మంచం కొనాలంటే రూ.1300 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది.

New Zealand: మన దేశంలోని గ్రామాల్లో నివసించే ప్రజల జీవన శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలు ఇళ్లలో కచ్చితంగా నవారు మంచం, నులక మంచం ఉంటాయి. నవారు మంచాలు(Vintage Indian Daybed) వచ్చిన తర్వాత నులక మంచాలు వాడకం తగ్గిపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. పల్లెల్లో నివాసం ఉండేవాళ్లు ఎక్కువగా నవారు మంచాలపైనే పడుకుంటారు. అయితే ఊళ్లలో నవారు మంచం అల్లేవారు ఉంటారు. లేదంటే ఇంట్లోని వారే నవారును అల్లుకుంటారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో నవారు మంచం కొనాలంటే రూ.1300 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. అయితే న్యూజిలాండ్‌లో మాత్రం నవారు మంచానికి ఉన్న ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్కడి అన్నాబెల్లె అనే ఓ ఈ కామ‌ర్స్ సైట్‌ నవారు మంచాలు అమ్మకం ప్రారంభించింది. 'వింటేజ్‌ ఇండియన్‌ డేబెడ్‌'తో అమ్ముతున్న నవారు మంచం ధర ఏకంగా రూ. 41, 297గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మంచం ధర సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అయితే ఆ ధర కూడా డిస్కౌంట్ రూపంలోనే అందుబాటులో ఉంటుంది. నవారు మంచం అసలు ధర రూ. 61,980 ఉంది. నవారు మంచం ధర చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతపెట్టి ఆ మంచం కొనుగోలు చేస్తారా అని ఆలోచిస్తున్నారు. న్యూజిలాండ్ లో నవారు మంచాలకు డిమాండ్ భారీగానే ఉందని తెలుస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story