ప్లీజ్ అర్థం చేసుకోండి.. మీరు మా దేశానికి రావద్దు: ప్రధాని

ప్లీజ్ అర్థం చేసుకోండి.. మీరు మా దేశానికి రావద్దు: ప్రధాని
దేశంలో గురువారం 23 కొత్త పాజిటివ్ కరోనా వైరస్ కేసులను నమోదు చేసిన తరువాత దేశ ప్రధాని ఓ నిర్ణయం తీసున్నారు. మొత్తం 23 కేసుల్లో 17 కేసులు భారతదేశం నుండి వచ్చినవి కావడంతో తమ దేశంలోకి భారత ప్రయాణీకుల ప్రవేశాన్ని నిలిపివేసింది.

దేశంలో గురువారం 23 కొత్త పాజిటివ్ కొరోనా వైరస్ కేసులను నమోదు చేసిన తరువాత న్యూజిలాండ్ ఓ నిర్ణయం తీసుకుంది. వీటిలో 17 కేసులు భారతదేశం నుండి వచ్చినవి కావడంతో తమ దేశంలోకి భారత ప్రయాణీకుల ప్రవేశాన్ని నిలిపివేసింది.

దక్షిణాసియా దేశం నుండి అధిక సంఖ్యలో వైరస్ కేసులు నమోదు కావడంతో న్యూజిలాండ్ తమ దేశ పౌరులతో సహా భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులందరి ప్రవేశాన్ని తాత్కాలికంగా రెండు వారాలపాటు నిలిపివేసింది.

"భారతదేశం నుండి వచ్చే ప్రయాణికుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము" అని ఆక్లాండ్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అన్నారు. ఈ సస్పెన్షన్ ఏప్రిల్ 11 సాయింత్రం 4 గంటల నుండి ప్రారంభమై ఏప్రిల్ 28 వరకు అమలులో ఉంటుంది. అవసరమైతే మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని ఆమె అన్నారు. విదేశీ ప్రయాణీకుల రాకపోకలను గమనించాలని జెసిండా అధికారులను ఆదేశించారు.

న్యూజిలాండ్‌లో ఇటీవల ఎక్కువ మంది ఇన్‌ఫెక్షన్ బారిన పడడంతో సరిహద్దు రాకపోకలను సమీక్షిస్తున్నారు. మెజారిటీ సంఖ్య భారతదేశం నుండి వచ్చినట్లుగా గుర్తించారు. బుధవారం 7 కేసులు రావడంతో అత్యవసర చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐసోలేషన్ వార్డులో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు గురువారం గుర్తించింది. 24 ఏళ్ల ఈ యువకుడు ఇంకా కోవిడ్ టీకా తీసుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story