నైజీరియా పడవ ప్రమాదంలో 100 మంది మృతి

నైజిరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ బోటు నైజర్ నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తర మధ్య నైజీరియాలో ఎగ్బోటి గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై వీరందరు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటనన జరిగింది. నైజర్ నదిలో అలల తాకిడికి ఈ బోటు నీట మునిగింది. మంగళవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఇందులో 103 చనిపోయినట్లుగా నైజీరియా అధికారులు తెలిపారు. బోట్ మునిగిన వార్త తెలుసుకున్న అధికారులు సహాయక బృందాలు, రంగంలోకి దిగాయి. పడవ ప్రమాదంలో ప్రాణాలతో బ్రతికి ఉన్న వాళ్లను కాపాడటం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా నైజర్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నటువంటి క్వారా రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. అడవిలో రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించిన అధికారులు ప్రమాదంలో సుమారు 100మందిని రక్షించామని చెబుతున్నారు.
సంఘటన తెల్లవారు జామున జరగడం, ప్రయాణికుల కోసం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అధికారులు తెలిపారు. నైజర్ నదిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నైజీరియాలో రివర్ బోట్ ప్రమాదాలు సర్వసాధారణం. ఇక్కడ చిన్న చిన్న ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి పడవలనే ఉపయోగిస్తారు. అంతే కాకుండా బోట్ ల ఓవర్‌లోడ్, పేలవమైన నిర్వహణ, భద్రతా నిబంధనలను పట్టించుకోకపోవడం అనేవి సర్వ సాధారణం.
గత నెలలో కట్టెలు, వంట చెరకు సేకరించడానికి పడవలో వెళ్లిన 15 మంది పిల్లలు మునిగిపోగా 25 మంది కనపడకుండా పోయారు. సరిగ్గా ఏడాది క్రితం ఇలాగే 29 మంది పిల్లలు మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆగ్నేయ అనంబ్రా రాష్ట్రంలో నదులు పొంగడంతో 76 మంది మృతువాత పడ్డారు. నైజీరియాలో రహదారి వ్యవస్థ ఒక పెద్ద సమస్య. ఎందుకంటే రవాణా వాణిజ్యం కోసం మీరు తప్పనిసరిగా నదిలో ప్రయాణించవలసి వస్తుంది అంతే కాక ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్, కిడ్నాప్ లు కూడా తరచుగా జరుగుతూనే ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com