Nikki Haley: అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో భారత సంతతి మహిళ నిక్కీ హేలీ తొలి విజయం అందుకున్నారు. ఈ రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తుండటంతో ఆమెకు దక్కిన విజయం ఊరటనిచ్చినట్టయ్యింది. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో హోలీ విజయం సాధించినా.. శనివారం నాడు మూడు రాష్ట్రాల్లో జరిగిన పార్టీ అభ్యర్థిత్వం ఎన్నికల్లో ఆమె వెనుకబడ్డారు. మిసోరి, మిచిగన్, ఐడహో కాకస్‌ల్లో ట్రంప్ హవా కొనసాగింది. దాదాపు అందుబాటులోని ప్రతినిధులనందరినీ ఆయన సొంతం చేసుకున్నారు. మరో 15 రాష్ట్రాల్లో మంగళవారం ఓటింగ్ జరగనుండగా.. హేలీ ముందుగానే తప్పుకోవడం గమనార్హం.
వాషింగ్టన్‌లోని మొత్తం 22 వేల ఓట్లలో 60 శాతం హేలీకి ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీచేసిన జో బైడెన్‌కు ఇక్కడ 92 శాతం ఓట్లు రావడం విశేషం. దీనిపై హేలీ టీం ఓ ప్రకటన చేస్తూ.. ‘వాషింగ్టన్‌లో రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్, అతడి గందరగోళాన్ని తిరస్కరించడంలో ఆశ్చర్యం లేదు’ అని పేర్కొంది. దీనికి ట్రంప్ బృందం ‘నిక్కీ హేలీని స్వాంప్ రాణిగా అభివర్ణిస్తూ’ ప్రకటన విడుదల చేసింది.
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి తొలి విజయం లభించింది. వాషింగ్టన్ డీసీ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె గెలుపొందారు. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న ట్రంప్‌కు బ్రేక్ పడినట్లయింది. అలాగే కీలకమైన సూపర్ ట్యూస్‌డే పోటీకి ముందు హేలీకి గొప్ప ఊతం లభించింది. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీని గెలుచుకున్న తొలి మహిళగా హేలీ రికార్డు సృష్టించారు. అదేవిధంగా డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్ ప్రైమరీని గెలుచుకున్న తొలి ఇండియన్-ఆమెరికన్‌గా కూడా ఆమె నిలిచారు. మంగళవారం 16 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనుండగా ట్రంప్, నిక్కీ హేలీల మధ్య పోటీ ఎలా ఉంటుందో మంగళవారం వచ్చే ఫలితాల్లో తేలనుంది. అనేక పరాజయాలు ఎదురైనప్పటికీ నిక్కీ హేలీ అధ్యక్ష ఎన్నికల బిడ్ నుంచి వైదొలగడానికి నిరాకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com