Nitish Kumar: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar).. ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఖ్యాతి సింగ్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేషన్ పేర్లను అందజేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినట్లు నితీశ్ తన ఎక్స్‌లో వెల్లడించారు. బీహార్‌కు అత్యధిక కాలం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా నితీశ్ రికార్డు క్రియేట్ చేశారు. అయితే రాజ్యసభలో సభ్యుడు కావాలన్న కాంక్ష ఉన్నట్లు ఆయన తెలిపారు. నితిశ్ తన అభిప్రాయాన్ని ఎక్స్‌లో వ్యక్తం చేశారు. బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నట్లు ఆయన చెప్పారు.
నితీశ్ తప్పుకోవడంతో.. బీహార్‌కు బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నితీశ్ కుమారుడు నిషాంత్.. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టే ఛాన్సు ఉన్నది. రెండు దశాబ్ధాల పాటు తనపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారని, దీని ఆధారంగానే బీహార్‌కు సేవ చేశానని, మీ నమ్మకం, మద్దతుతోనే బీహార్‌ను కొత్త అభివృద్ధి కోణం వైపు తీసుకెళ్లినట్లు చెప్పారు. తనపై నమ్మకాన్ని ఉంచి సపోర్టు ఇచ్చినందుకు గతంలో అనేక సార్లు కృతజ్ఞలు చెప్పినట్లు నితీశ్ పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి.. బీహార్ అసెంబ్లీ, మండలితో పాటు.. పార్లమెంట్ ఉభయసభల్లోనూ సభ్యుడిని కావాలన్న కాంక్ష ఉండేదని చెప్పారు. ఆ కోరికతోనే రాజ్యసభ సభ్యుడిని అయ్యే సందర్భం వచ్చిందన్నారు. భవిష్యత్తులో మీతో ఇదే రకమైన రిలేషన్ కొనసాగుతుందన్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. బీహార్ సీఎం పోస్టు రేసులో నిత్యానంద్ రాయ్‌తో సమ్రాట్ చౌదరీ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
