గుడ్‌న్యూస్.. వారికి వ్యాక్సిన్ అవసరం లేదు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారి శరీరంలో కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాధి నిరోధక కణాలు సరిపడా తయారై ఉంటాయి. కాబట్టి వీరికి పదే పదే వ్యాక్సినేషన్ కూడా అవసరం ఉండదని అంటున్నారు అధ్యయనకారులు.
పలువురు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు 19 నుంచి 81 ఏళ్ల మధ్య వయసులో ఉన్న185 కోవిడ్ బాధితుల నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షించారు. ఆ అధ్యయనంలో వారి శరీరాల్లో వైరస్‌తో సమర్ధంగా పోరాడే బీ, టీ లింపోసైట్ కణాల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు కనిపించింది. ఇలా పెరిగిన కణాలు ఏళ్ల తరబడి శరీరాల్లో ఉండి, శరీరాన్ని రీ ఇన్‌ఫెక్షన్‌కు గురి కాకుండా కాపాడతాయి. అలాగే వీరి శరీరాల్లో కోవిడ్ వైరస్‌కు సంహకరించే క్రమంలో తయారయ్యే యాంటీబాడీలు కూడా ఆలస్యంగా అంతరిస్తున్న్లట్లు వారు గమనించారు.
కోలుకున్న వ్యక్తుల్లోని రోగనిరోధక వ్యవస్థ వైరస్ ఎప్పుడు దాడి చేసినా పోరాడే శక్తిని కలిగి ఉంటుందని అన్నారు. ఫలితంగా వైరస్‌తో కూడిన వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తరహా రోగ నిరోధక వ్యవస్థ ఎన్నేళ్లు ఉంటుందనేది కచ్చితంగా చెప్పడం కష్టం అని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com