Peter Higgs:: నోబెల్ గ్రహీత పీటర్ హిగ్స్ కన్నుమూత

దైవకణాన్ని కనుగొన్న బ్రిటన్ దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ కన్నుమూశారు. 94 ఏళ్ల హిగ్స్ తన నివాసంలో ప్రశాంతంగా కన్నుమూశారనీ అంతకుముందురోజు ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీ వెల్లడించింది. గొప్ప టీచర్‌గా, మార్గనిర్దేశకునిగా, యువ శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది.
దైవకణం లేదా హిగ్స్‌బోసన్ సిద్ధాంతంతో విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎలక్ట్రాన్, క్వార్క్, కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో చిక్కుముడులు విప్పిన ఆయన.. 1964లో బోసన్ కణం ఉనికిని తన సిద్ధాంతాల ద్వారా తెలియజేశారు. 2012లో యూరోపియన్ ఆర్గనేజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్‌లోని లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్‌లో దైవకణంపై ప్రయోగాలు చేశారు. ఆ ఫలితాల ఆధారంగా అరశతాబ్దానికి ముందే హిగ్స్ రూపొందించిన సిద్ధాంతాన్ని, బోసన్ కణం ఉనికిని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. తన సిద్ధాంతానికి బెల్జియన్ భౌతికశాస్త్రవేత్త ఫ్రాంకోయిస్‌తో కలిసి ఆయన 2013లో నోబెల్ బహుమతి అందుకున్నారు
‘‘పీటర్ హిగ్స్ తన నివాసంలో ప్రశాంతంగా కన్నుమూశారు. అంతకుముందురోజు ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొప్ప టీచర్‌గా, మార్గనిర్దేశకునిగా, యువ శాస్త్రవేత్తలకు ఆయన ఒక స్ఫూర్తివంతంగా నిలుస్తాడు’’ అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ దాదాపు ఐదు దశాబ్దాలు ఈ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆ వర్సిటీతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com