COP28: కాప్– 28 సమావేశాలకు సర్వం సిద్ధం

ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగే కాప్ 28వ సదస్సుకు యూఏఈ అతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వాతావరణ సమస్యలపై దృష్టి పెట్టింది. ఈనెల 30 నుంచి డిసెంబరు 12 వరకు దుబాయ్‌లో కాప్-28 సదస్సు జరగనుంది. 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్న యూఏఈ అందుకోసం బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. అందులో భాగంగా దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేరుతో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్‌లో ఇప్పటికే దాదాపు 122 చదరపు కిలోమీటర్ల మేర సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను.... ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించాలనే విషయంలో చర్చలు పూర్తిగా పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో కాప్ 28 సదస్సు ద్వారా.. పర్యావరణ పరిరక్షణ కోసం చర్చలు మెుదలుపెట్టేందుకు మరో అవకాశం లభించిందని అరబ్ దేశం భావిస్తోంది.
ఐతే యూఏఈ రోజుకి 4 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తూ.. పెద్దఎత్తున వాతావరణానికి నష్టం కలిగించేందుకు కారణమవుతోంది. చమురు ఉత్పత్తిని.....రోజుకు 5 మిలియన్ల బ్యారెల్స్ వరకు పెంచాలని UAE భావిస్తున్నందున పర్యావరణ కాలుష్య సమస్య మరింత పెరుగుతుందనే ఆందోళనలు.. వ్యక్తమవుతున్నాయి. బెహెమోత్ నేషనల్ స్టేట్ ఆయిల్ కంపెనీకి CEO సుల్తాన్ అల్-జాబర్‌ను COP సదస్సుకు అధ్యక్షుడిగా నియమించడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. అతను వాతావరణ మార్పుల కంటే చమురు వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ హర్మ్యాల నుంచి అనేక రిసార్టులు, ఆధునిక సాంకేతికతను సమకూర్చుకున్న యూఏఈ పర్యావరణ పరిరక్షణ విషయంలో చేస్తున్న ప్రకటనలపై.. విమర్శలు వెల‌్లువెత్తుతున్నాయి. ఐతే తాము జీరో కర్బన ఉద్గారాలకు కట్టుబడి ఉన్నామని అరబ్ దేశం చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com