North Korea: కిమ్ కనబడుట లేదు..!

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ నెలరోజులుగా కనపడటంలేదు. దీంతో తన ఆరోగ్య పరిస్థితులపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకు ముందు 2014లో కూడా కిమ్ దాదాపు 40 రోజులు కనపడకుండా ఉన్నారు. ఇలా కనపడకుండా ఉండటం ఇది రెండోసారి కావడం విషేశం. ప్యోంగ్యాంగ్‌లో నిర్వహించిన భారీ పరేడ్‌కు కూడా కింమ్ హాజరు కాకపోవడంతో అందరిలోను అనుమానాలు రేకెత్తుతున్నాయి. వార్తా సంస్థల సమాచారం ప్రకారం కిమ్ ఆదివారం జరిగిన ముఖ్యమైన పోలిబ్యూటో సమావేశానికి సైతం హాజరు కాలేదు. అతను పోలిబ్యూటో సమావేశాన్ని స్కిప్ చేయడం ఇది మూడోసారి. కొరియ ఆర్మీ 75వ వార్షిక సందర్భంగా నిర్వహించిన భారీ పరేడ్‌కు కిమ్ తప్పక హాజరు కావాలి. కానీ ఆయన హాజరు కాకపోవడం జనాల్లో చర్చకు దారితీస్తుంది. ఈ పరేడ్‌ను కిమ్ షోకేజ్ గా వాడుకొని తన అణ్లాయుధాలు, క్షిపణి తయారీల నుంచి తాజాగా హార్డ్‌వేర్‌ను ప్రదర్శించ వచ్చునని వాటి మూలంగా అమెరికాతో పాటు ఆసియా దేశాలకు కూడా ముప్పు ఉండొచ్చని వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉండగా స్థానిక మీడియా మాత్రం సోమవారం జరిగిన పార్టీ రూలింగ్ వర్కర్స్ కమీషన్, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశానికి కిమ్ అధ్యక్షత వహించారని నివేదికలు పేర్కొన్నాయి. అక్కడ అధికారులు ఈ సంవత్సరానికి మేజర్ మిలిటరీ, రాజకీయ పనులు అలాగే సైన్యాన్ని నిర్మించడానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారని మీడియా వర్గాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com