North Korea: పాపే కాదు... పేరు కూడా ప్రాణమే.. అందుకే...

North Korea: పాపే కాదు... పేరు కూడా ప్రాణమే.. అందుకే...
ఉత్తర కొరియా అధ్యక్షుడి కొత్త పంచాయితీ; పాప పేరు పెట్టుకోవద్దంటూ కొత్త ఆదేశాలు జారీ....

ప్రజలపై తలతిక్కల నిబంధనలు విధిస్తూ నిరంకుశత్వ పాలనలో కొత్త అధ్యాయనాలు రచించడంలో సిద్ధహస్థుడైన ఉత్తర కొరియా నియంత కిమ్ మరోసారి తన జులం ప్రదర్శించాడు. ఈసారి తన కన్న కూతురిపై ప్రేమతో కర్కశత్వ ఉత్తర్వులు జారీ చేశాడు. దేశంలో తన తనయ జూ యే పేరు ఇంకెవ్వరూ పెట్టుకోకూడదని ఆదేశించాడు. ఇప్పటికే అలాంటి పేర్లు ఎవరికైన ఉండి ఉంటే తక్షణమే తమ పేర్లు మార్చుకోవాలని సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టాడు. ఈ మేరకు రేడియో ఫ్రీ ఏషియా ప్రకటన విడుదల చేసింది. ఒక వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా జరిగిపోవాలని కిమ్ ఆదేశాలు జారీ చేశాడు. కిమ్ ఉత్తర్వులు మేరకు రంగంలోకి దిగిన అధికారులు ప్రభుత్వ గుర్తింపు పత్రాల్లో జూ యే పేరిట ఎవరి పేర్లు ఉన్నాయో వెలికితీస్తున్నారు. త్వరిత గతిన వారిని పేర్లు మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిలోనూ జూ యే తండ్రితో కలసి పాలుపంచుకుంటోంది. దీంతో కిమ్ తరువాత ఆమే కొత్త నియంతగా మారే అవకాశముందని తెలుస్తోంది.

Tags

Next Story