North Korea: దక్షిణ కొరియాను కలిపే రోడ్లను పేల్చేయించిన కిమ్ జోంగ్ ఉన్..

North Korea:  దక్షిణ కొరియాను కలిపే రోడ్లను  పేల్చేయించిన కిమ్ జోంగ్ ఉన్..
X
ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని దేశాల అధినేతలతో పోలిస్తే కిమ్‌ రూటే సపరేటు. ఆయన ఏదైనా చెప్పాడంటే అది కచ్చితంగా చేసి తీరుతాడు. తాజాగా పొరుగు దేశం దక్షిణ కొరియా విషయంలోనూ అదే చేశాడు. చెప్పినట్టుగానే సియోల్‌ను కలిసే సరిహద్దు రోడ్లను పేల్చేయించాడు.

దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఉత్తర కొరియా సైన్యం నాలుగు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తమ దేశంతో ఉన్న సరిహద్దును దాటే రోడ్ల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి ఆ రోడ్లను సోమవారం పేల్చేయించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్‌ చీప్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మంగళవారం వెల్లడించారు. తమ వైపు రహదారులను మాత్రం సైన్యం కాపాడుతున్నట్లు తెలిపారు.

కాగా, తమ రాజధాని ప్యాంగాంగ్‌పైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపిందని ఉత్తర కొరియా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో అనుసంధానం ఉన్న రైలు, రోడ్లను పూర్తిగా కట్‌ చేసి సరిహద్దు ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని గత వారం ఉత్తర కొరియా సైన్యం తెలిపింది. మరోసారి ప్యాంగాంగ్‌ పైన దక్షిణ కొరియా డ్రోన్లు కనిపిస్తే భయంకరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. సరిహద్దుల్లో కాల్పుల కోసం ఎనిమిది సైనిక యూనిట్లను సిద్ధంగా ఉంచింది.

Tags

Next Story