North Korea: దక్షిణ కొరియా ద్వీపం దిశగా కిమ్‌ సైన్యం కాల్పులు..

North Korea: దక్షిణ కొరియా ద్వీపం దిశగా కిమ్‌ సైన్యం కాల్పులు..
కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత

ఉత్తర కొరియా మరోసారి భారీ కవ్వింపు చర్యకు పాల్పడింది. ఈ సారి ఏకంగా..దక్షిణ కొరియా ద్వీపమైన యొన్పియోంగ్‌పై 200 శతఘ్నులను పేల్చింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన దక్షిణకొరియా సైన్యం ఆ ద్వీపంలోని ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. కవ్వింపు చర్యలు మానుకోవాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది.

కొరియాల మధ్య మరోసారి...ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దక్షిణ కొరియా భూభాగాన్నిలక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియా కాల్పులకు దిగింది. ఈ ఉదయం 9 గంటల నుంచి.. 11 గంటల మధ్యలో ఉత్తర కొరియా దాదాపు 200 శతఘ్నులను దక్షిణ కొరియా ద్వీపమైన యొన్సియోంగ్‌ దిశగా పేల్చిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వివరించారు. అవి దక్షిణ కొరియా భూభాగానికి చేరలేదని, మధ్యలోనే సముద్రంలోని బఫర్‌ జోన్‌లో పడిపోయాయని తెలిపారు. ఇప్పటి వరకూ తమ దేశ పౌరులు.., సైనిక సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ప్రతినిధి లీ సంగ్‌ వెల్లడించారు. ఉత్తర కొరియా చర్యలు ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతకు ముప్పుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2010లోఉత్తరకొరియా ఈ ద్వీపంపై జరిపిన కాల్పుల్లోనలుగురు చనిపోయారు. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిగా దక్షిణ కొరియా కూడా సైనిక డ్రిల్స్‌ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది.


రెండేళ్లుగా క్షిపణి పరీక్షలు చేస్తూ సియోల్‌ను ఉత్తర కొరియా కవ్విస్తోంది. వీటిల్లో కొన్ని క్షిపణుల శకలాలు.... దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. అమెరికా, దక్షిణ కొరియా కవ్విస్తే....వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని కొత్త ఏడాది సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవలే సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక నుంచి.. దక్షిణ కొరియాతో ఎలాంటి సయోధ్య పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తేల్చేశారు. వాషింగ్టన్‌, సియోల్‌ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే....... అణ్వాయుధాలు వాడటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే కిమ్‌ చిన్న కుమార్తె తదుపరి వారసురాలిగా నియమితులయ్యే అవకాశముందని.. దక్షిణ కొరియా నిఘా సంస్థ గురువారం వెల్లడించింది. తాజాగా కిమ్‌ తన చిన్న కుమార్తెతో కలిసి మిస్సైల్ లాంఛర్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. అందులోని క్షిపణుల సామర్థ్యాన్ని అధికారులుఆమెకు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story