North Korea: మరోసారి ఉత్తరకొరియా "క్షిపణి గర్జన”

వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఉత్తర కొరియా (North Korea) మరోసారి రెండు బాలిస్టిక్ క్షిపణుల( ballistic missiles)ను ప్రయోగించింది. దశాబ్దాల తర్వాత అమెరికా జలాంతర్గామి దక్షిణ కొరియా జలాల్లోకి చేరుకున్న తర్వాత ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణుల(two short-range ballistic missiles)ను ప్రయోగించిందని దక్షిణ కొరియా ప్రకటించింది. అమెరికా దక్షిణ కొరియా(US-South Korea) మధ్య రక్షణరంగ బలోపేతంపై చర్చలు ప్రారంభమైన ఒక రోజు తర్వాత ఉత్తర కొరియా ఈ క్షిపణులను ప్రయోగించింది. ఉత్తర కొరియా తూర్పు సముద్రంలోకి రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా ప్రకటించింది.
ప్యాంగ్యాంగ్‌లోని సునాన్ ప్రాంతం నుంచి ఇవాళ తెల్లవారుజామున 3:30 నుంచి 3:46 మధ్య క్షిపణులను ప్రయోగించారని, దాదాపు 550 కిలోమీటర్లు ప్రయాణించాక అవి సముద్రంలో కూలిపోయాయోని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) ప్రకటించారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్‌వి.. కొరియా ద్వీపకల్పంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజంలో కూడా శాంతికి హాని కలిగించే, రెచ్చగొట్టే చర్యలని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల స్పష్టమైన ఉల్లంఘనని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ విమర్శించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు ధీటుగా ప్రతిస్పందిస్తామని. దానికి తమ సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందని దక్షిణ కొరియా ప్రకటించింది.
మరోవైపు అక్రమంగా తమ దేశ భూభాగంలోకి అడుగుపెట్టిన ఓ అమెరికా (America) దేశస్థుడిని ఉత్తర కొరియా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఓ అమెరికా (America) జాతీయుడు దక్షిణ కొరియా (South Korea) భూభాగం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కిమ్ జోంగ్ ఉన్ సామ్రాజ్యం ఉత్తర కొరియాలోకి (North Korea) అడుగుపెట్టాడు. దాంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎలాంటి అనుమతులు లేకుండా దక్షిణ కొరియా (South Korea) నుంచి ఉత్తర కొరియా (North Korea) సైనిక సరిహద్దును దాటే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్యనున్న సంయుక్త భద్రతా ప్రాంత సందర్శనకు వచ్చినట్లు తెలిసింది. ఇది సైనిక రహిత ప్రాంతం. అందుకే ఎక్కువ మంది పర్యాటకులు సందర్శనకు వెళ్తుంటారు.
ఉత్తర కొరియాలో సంయుక్త భద్రతా ప్రాంత సందర్శనకు వెళ్లిన ఓ అమెరికన్ ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటాడని, ఆ సైనిక సరిహద్దు రేఖ డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) పరిధిలో ఉందని యునైటెడ్ నేషన్స్ కమాండ్ ట్వీట్ చేసింది. సరిహద్దు దాటి వెళ్లిన వ్యక్తి DPRK కస్టడీలో ఉన్నట్లు భావిస్తున్నామని, కొరియన్ పీపుల్స్ ఆర్మీతో సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com