ICBM missile : ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా

ICBM missile : ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
X
అమెరికాను టార్గెట్‌ చేయొచ్చు..!

ఉత్తర కొరియా విజయవంతంగా లాంగెస్ట్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌లో పరీక్షించింది. సుదూరంలో ఉన్న అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రష్యాకు సహాయం అందించేందుకు దళాలను పంపిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్న మరోసారి.. మిస్సైల్‌ను పరీక్షించడంతో అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది దీర్ఘశ్రేణి బాలిస్టిక్ తరహా క్షిపణి అని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అన్నారు. ఈ ప్రయోగం ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత, ముఖ్యంగా అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని సాగినట్టు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా భూభాగాలను చేరుకునే ఐసీఎంబీ సామర్థ్యం, అణ్వాయుధ పరీక్షల నిర్వహణకు ఉత్తర కొరియా సిద్ధమైందని ఇటీవల దక్షిణ కొరియా సైన్యం నివేదించింది. ఈ క్రమంలో తాజాగా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఆందోళ వ్యక్తమవుతోంది.

కాగా, ఉత్తర కొరియా దుందుడుకు చర్యలను అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధది సీన్ సవెట్టి తీవ్రంగా ఖండించారు. ఇవి ఐక్యరాజ్యసమితి తీర్మాన్ని ఉల్లంఘించి, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమేనని అన్నారు. దేశ భద్రతతో పాటు ఆ ప్రాంతంలోని జపాన్, దక్షిణ కొరియాలకు మద్దతు కొనసాగుతుందని సవెట్టి అన్నారు. కిమ్ కవ్వింపుల నేపథ్యంలో అమెరికా ఆ ప్రాంతంలో సైనికుల మోహరింపు, మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సహాయం చేస్తుందనే నివేదికల అందుతోన్న సమయంలో క్షిపణి పరీక్షలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, రష్యా యూనిఫామ్ ధరించి, ఆ దేశం ఆయుధాలతో ఉత్తర కొరియా సైనికులు.. ఉక్రెయిన్‌పై పోరాటం చేస్తున్నారని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో 11 వేలకుపైగా ఉత్తర కొరియా సైన్యాలు ఉన్నారని, వీరిలో 3 వేల మంది యుద్ధభూమికి సమీపంలో ఉన్నట్టు దక్షణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. రష్యాకు కిమ్ జోంగ్ ఉన్న మద్దతివ్వడం పట్ల అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదని, అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story