Norway Floods: నార్వే లో వరదలు

నార్వే దేశంలో హన్స్ తుఫాను విధ్వంసం సృష్టించింది. చాలా ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను కారణంగా ప్రతిచోటా భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. హన్స్ హరికేన్ కారణంగా నార్వేలో వరదలు సంభవించి రెండు మొబైల్ ఇల్లు కొట్టుకుపోయిన వీడియో నార్వే ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించి గ్లామా నదిలోకి నీటి ఉదృతి కొనసాగింది. దీనితో ఆ నడిపై ఉన్న బ్రాస్కెరీడ్‌ఫాస్ జలవిద్యుత్ ప్లాంట్‌లో ఆనకట్టలో కొంత భాగాన్ని పేల్చివేయాలని అధికారులు మొదట భావించారు. అయితే నిర్మాణంలో నీరు చేరడంతో ఆ ప్రతిపాదనను రద్దు చేశారు.దిగువన ఉన్న కమ్యూనిటీలను ఖాళీ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగాఆ ఆనకట్ట పాక్షికంగా పగిలిపోయింది.
వరద హెచ్చరికల అనంతరం వందలాది మందిని అత్యవసవర సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నోర్దిక్ ప్రాంతంలో పరిస్థితి మరీ విషమంగా ఉంది. విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం వ్యాపించింది. అలాగే రోడ్లు తెగిపడటం, వాగులు, నదులు పొంగిపొర్లడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. స్వీడన్ దేశంలో ఆదివారం ఏర్పడిన హన్స్ హారికేన్ తుఫాను ఇది. ఇటీవలి రోజుల్లో ఉత్తర ఐరోపా అంతటా గందరగోళానికి కారణమైంది. నార్వే దేశాన్ని చేరుకుని ఆ దేశాన్ని కుదిపివేసింది. దక్షిణ నార్వేలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్ వర్షం ఉన్నప్పుడు కంటే వర్షం ఆగిన తరువాత ఎప్పడు అతి పెద్ద సవాలు ఉందన్నారు. అయినా తాము అన్నింటికీ సిద్ధమే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com