Kamala Harris: అధ్యక్ష పీఠం కమలా హారిస్‌దే.. జోస్యం చెప్పేసిన యూఎస్ నోస్ట్రడామస్
అమెరికా అధ్యక్ష బరిలో మరోమారు నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశ తప్పదట. భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఈసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠిస్తారట. అమెరికా నోస్ట్రడామస్‌గా పేరు సంపాదించుకున్న ఎన్నికల విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్ ఈ జోస్యం చెప్పారు. వైట్‌హౌస్ రేసులో వున్న ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ నామినీ కమలా హారిస్ విజయం సాధిస్తారని లిచ్‌మన్ అంచనా వేశారు. ‘కమలా హారిస్ అమెరికా తదుపరి ప్రెసిడెంట్’ అని ఓ వీడియోను విడుదల చేశారు.
సరిగ్గా మరో రెండు నెలల్లో అంటే నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్టుగా సాగుతోంది. అమెరికన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిచ్‌మన్ 4 దశాబ్దాలుగా చెబుతున్న జోస్యాలు నిజమవుతున్నాయి. అందుకే ఆయనంటే అందరికీ గురి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతారని 2016లో ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. అలాగే, 2020లో బైడన్‌దే విజయమని చెప్పారు. ఇప్పుడు కమలా హారిస్‌దే విజయమని అంచనా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com