OLX Layoff 2023 : OLXలో ఉద్యోగాల ఊస్టింగ్

OLXలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా .. 15 శాతం మందిని ఇంటికి పంపిస్తున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులను తీసివేయడంపై విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్ ఆశయాలను చేరుకోవాలంటే కొన్ని నిర్ణయాలను తీసుకోకతప్పదని తెలిపారు. దీంతో దాదాపు 1500మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టనున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థలు లేఆఫ్ ప్రకటించగా.. ఆ జాబితాలో ఇప్పుడు OLX చేరింది.
ప్రపంచవ్యాప్తంగా తన వర్క్ ఫోర్స్ ను తగ్గిస్తున్నట్లు తెలిపిన OLX... మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. " మేము మా శ్రామిక శక్తిని తగ్గించుకుంటున్నాము. విలువైన ఉద్యోగులు విడిపోయినందుకు క్షమించాలి. కంపెనీ భవిష్యత్తు ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము" అని అన్నారు. భారత్ నుంచి ఎంత మంది ఉద్యోగాలను కోల్పోయారో తెలియలేదు. ఇంజనీరింగ్, ఆపరేషన్స్ టీం ఎక్కువగా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com