Omicron Variant: సౌత్ ఆఫ్రికా నుండి వస్తున్న ప్రయాణికుల్లో కరోనా..

Omicron Variant (tv5news.in)
Omicron Variant: కరోనా గురించి దాదాపుగా ఇండియాలో చాలామంది మర్చిపోయారు. ఇదే సమయంలో మరో కొత్త వేరియంట్ అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. అదే సౌత్ ఆఫ్రికాలో ప్రాణం పోసుకున్న ఒమ్రికాన్. ఈ వేరియంట్ ఇప్పుడు కోరలు చాచి ప్రపంచం మొత్తం వ్యాపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా నుండి ఇతర దేశాలకు వెళ్లిన చాలామంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది.
ఒమ్రికాన్ వేరియంట్ భయంతో ఇప్పటికే ప్రయాణికులపై ఆంక్షలను మొదలుపెట్టేశాయి దేశాలు. కానీ అప్పటికే సౌత్ ఆఫ్రికా నుండి వేరే దేశాలకు ప్రయాణమైన చాలామందిలో ఈ ఒమ్రికాన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నెదర్లాండ్స్ ఒమ్రికాన్ ప్రమాదంలో పడింది. ప్రపంచంలో అందరికంటే ముందుగా నెదర్లాండ్స్ ప్రయాణికులపై ఆంక్షలు విధించినా కూడా లాభం లేకపోయింది.
ఒమ్రికాన్ బయటపడే సమయానికే ఎంతోమంది సౌత్ ఆఫ్రికన్స్ నెదర్లాండ్స్ ప్రయాణమయ్యారు. శుక్రవారం సౌత్ ఆఫ్రికా నుండి రెండు విమనాలు ఆమ్‌స్టర్‌డామ్‌కు వచ్చాయి. అందులో అందరు ప్రయాణికులకు వైరస్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 61 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ రెండు విమానాలు కలిపి మొత్తం 600 మంది ప్రయాణికులు ఉన్నారని అక్కడి అధికారులు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com