WHO: ప్రపంచవ్యాప్తంగా అంతరిస్తున్న వలస జాతులు

వలస జాతుల పరిరక్షణపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో విస్తుపోయేవిషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలస జాతుల్లో 20 శాతం అంతరించిపోయే దశలో ఉన్నాయని ఐరాస నివేదిక తెలిపింది. 44 శాతం వలస జాతుల జనాభా క్షీణిస్తున్నట్లు వెల్లడించింది. మహాసముద్రాల్లో 97 శాతం వలస జాతుల చేపలు క్షీణించే దశలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
వలస జాతుల పరిరక్షణపై ఐక్యరాజ్య సమితి సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోని వలస జాతుల్లో 44 శాతం క్షీణిస్తున్నాయని తెలిపింది. ప్రతి ఐదు వలస జాతుల్లో ఒకటి అంతరించే ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్, సమర్‌ఖండ్‌లో జరిగిన ఐరాస వన్యప్రాణుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు. ఐరాస పర్యావేక్షణలో ఉన్న 1200 వలస జాతుల్లో ఐదు శాతం కన్న ఎక్కువ జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మహాసముద్రాల్లో వలస జాతులకు చెందిన 97 శాతం చేపలు క్షీణదశలో ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. వలస జాతుల పరిరక్షణ జాబితాలో లేని 399 జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు ఐరాస నివేదిక తెలిపింది. పక్షులు, సముద్రపు తాబేళ్లు, తిమింగలాలు, షార్కులు మరికొన్ని వలసజాతి జంతువులు తమ ఆహారం కోసం కాలానుగుణంగా వలసలు వెళ్తాయి. ఆ సమయంలో అక్రమంగా వేటాడే వేటాగాళ్ల చేతిలో కొన్ని జంతువులు బలికాగా మరికొన్ని ప్రాణులు వాతావరణ మార్పు, కాలుష్య కోరళ్లో చిక్కుకుని మృత్యువు ఒడికి చేరుకుంటున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పు ఆసియా, ఐరోపా, భారత్, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికాల్లో ఆనకట్టల ఫలితంగా వలస జాతి ప్రాణుల ఆవాసాలు విచ్ఛినం అవుతున్నాయని ఐరాస నివేదిక తెలిపింది. జంతువులు సంతానం, ఆహారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తాయని వాటికి మార్గమధ్యలో తాత్కాలిక నివాసాలు అవసరమని.....ఐరాస వన్యప్రాణుల సమావేశంలో ఈ నివేదిక ప్రధాన రచయిత కెల్లీ మల్ష్ వెల్లడించారు. కొన్ని జీవ జాతుల జీవన విధానంలో వలస వెళ్లడం అనేది తప్పనిసరి ప్రక్రియ అని....ఆ ప్రక్రియ మానవుల కారణంగా, వాతావరణ మార్పు వల్ల నిలిచినట్లైతే అది ఆ వలస ప్రాణులను మృత్యువులోకి నెట్టినట్లవుతుందని పర్యావరణ శాస్త్రవేత్త స్టువర్ట్ పిమ్ తెలిపారు. ఐరాస సమావేశంలో పాల్గొన్నవారు వలస జాతుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com