అన్‌లాక్ చేసే ముందు ఆలోచించాలి.. : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

మహమ్మారి కరోనా సమూహంలోకి మరింతగా చొచ్చుకొని వస్తుంది. వైరస్ వ్యాప్తి ఉన్న దేశాలు అన్‌లాక్ ప్రక్రియను నిరోధించాలి. ఆంక్షలు విధిస్తూ అన్‌లాక్ ప్రక్రియను చేబడితే అవి కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ఎందుకంటే వైరస్ నియంత్రణలో లేకుండా అన్నీ తెరవడం విపత్తును రెట్టింపు చేసినట్లవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. చాలా మంది ఆంక్షలతో విసిగిపోతున్నారని సాధారణ జీవితం గడిపేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని అధనామ్ అన్నారు. ఎనిమిది నెలలుగా అమలులో ఉన్న కోవిడ్ ఆంక్షలను తొలగించాలని కోరుకుంటున్నారని అన్నారు.
ఆర్థిక వ్యవస్థలు తిరిగి తెరిచే ప్రయత్నాలకు డబ్ల్యూహెచ్‌ఓ పూర్తిగా మద్దతు ఇచ్చిందని టెడ్రోస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.."పిల్లలు పాఠశాలకు, ప్రజలు కార్యాలయాలకు తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము, కాని అది సురక్షితంగా జరగాలని ఆశిస్తున్నాము. "మహమ్మారి వ్యాప్తి ముగిసిందని ఏ దేశం కచ్చితంగా చెప్పలేక పోతోంది అని ఆయన అన్నారు. వాస్తవానికి ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. నియంత్రణ లేకుండా ప్రజలు సాధారణ జీవితం గడపాలని కోరుకోవడం కోరి విపత్తు తెచ్చుకోవడం వంటిదని టెడ్రోస్ అన్నారు. స్టేడియంలు, నైట్‌క్లబ్‌లు, ప్రార్థనా స్థలాలు, ఇతర సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని అన్నారు. అన్‌లాక్ నిర్ణయం తీసుకునేముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆచితూచి వ్యవహరించాలని వివిధ దేశాల ప్రజలకు ఆయన సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com