మహరాణి మరణిస్తే ఏం చెయ్యాలి.. ప్లాన్ లీక్

బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణించినప్పుడు ఏమి జరుగుతుందనే వివరాలను బహిర్గతం చేసే పత్రాలు శుక్రవారం లీక్ అయ్యాయి. అయితే బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు లీక్ గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
యుఎస్ ప్రధాన కార్యాలయం వార్తా సంస్థ "పొలిటికో" లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. "ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్" విడుదలైన వివరాల్లో మహరాణి మరణానంతరం ఏమి జరుగుతుందో నివేదించారు. అలాగే, రాణి మరణించిన రోజును "డి డే" గా అధికారులు సూచిస్తారని తెలిసింది.
క్వీన్ ఎలిజబెత్ IIకు 95 సంవత్సరాలు. బ్రిటిష్ చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన రాణి. ఆమె మరణించిన 10 రోజుల తర్వాత సమాధి చేయబడుతుందని అందులో పేర్కొన్నారు. ఆమె కుమారుడు, వారసుడు అయిన ప్రిన్స్ చార్లెస్ అంత్యక్రియలు జరగడానికి ముందు UK పర్యటనకు బయలుదేరుతారు.
శవపేటిక మూడు రోజుల పాటు పార్లమెంటు భవనంలో ఉంటుంది. లండన్‌లో వేల మంది ప్రజలు ఆమె పార్ధివదేహాన్ని సందర్శించడానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రణాళికల ప్రకారం, ఆమె అంత్యక్రియలకు ముందుగానే ఊహించిన విధంగా రద్దీ కారణంగా గందరగోళం నెలకొంటుందని అధికారులు ముందుగానే అప్రమత్తమై విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారని వెల్లడించింది.
కొత్త రాజు చార్లెస్ ఆమె మరణించిన తర్వాత రోజుల్లో నాలుగు దేశాలలో పర్యటిస్తారని 'పొలిటికో' వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com