North Korea: అమెరికా స్థావరాలే టార్గెట్..

North Korea: అమెరికా స్థావరాలే టార్గెట్..
మరోసారి క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహించడం వల్లే ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ పరిమాణాల నడుమే ఉత్తర కొరియా ప్రభుత్వం తాజాగా ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అది మొదటి మిసైల్ ప్రయోగం కావడం గమనార్హం. దక్షిణ కొరియా సైన్యం దీన్ని ధృవీకరించగా.. జపాన్ రక్షణశాఖ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఉత్తర కొరియా ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అది కొరియా ద్వీపకల్పంతో పాటు జపాన్ మధ్య సముద్రంలో పడిపోయింది. ఈ క్షిపణి ఈ ప్రాంతంలోని రిమోట్ ద్వారా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేకుని ప్రయోగించింది. ఈ ఏడాది ఉత్తర కొరియాకు ఇదే తొలి క్షిపణి పరీక్ష.. మరోవైపు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి ఇవాళ రష్యా పర్యటనకు బయలుదేరుతున్నారు.


ఇక, ఉత్తర కొరియా రాజధాని ప్రాంతం నుంచి ఆదివారం మధ్యాహ్నం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని సైన్యం గుర్తించింది.. అది 1,000 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిపోయిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. నార్త్ కొరియా ఇలాంటి ప్రయోగాలతో రెచ్చగొట్టలాని చూస్తున్నారని సౌత్ కొరియా పేర్కొనింది. ఇలాంటి చర్యలు కొరియా ద్వీపకల్పం యొక్క శాంతికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందన్నారు.

అయితే, ఉత్తర కొరియా ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా స్పందించేందుకు దక్షిణ కొరియా సంసిద్ధతను కొనసాగిస్తుందని జాయింట్ చీఫ్‌లు తెలిపారు. క్షిపణి ప్రయోగాన్ని జపాన్ కూడా ధృవీకరించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌కు 3,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా సైనిక స్థావరం గువామ్‌ను లక్ష్యంగా చేసుకునేలా ఈ క్షిపణిని రూపొందించారు.

కొరియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ స్ట్రాటజీకి చెందిన క్షిపణి నిపుణుడు చాంగ్ యంగ్-క్యున్ మాట్లాడుతూ.. పరిధిని సర్దుబాటు చేయడం ద్వారా ఇది జపాన్‌లోని ఒకినావా ద్వీపంలోని యూఎస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోని ఈ ప్రయోగం చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌లో జరిగే దక్షిణ కొరియా పార్లమెంటరీ ఎన్నికలతో పాటు నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఉత్తర కొరియా రెచ్చగొట్టే క్షిపణి పరీక్షలను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story