గుడ్డు బరువు 2 కిలోలు.. ఒక్క గుడ్డు 15 మందికి ఫుడ్డు..!

గుడ్డు బరువు 2 కిలోలు.. ఒక్క గుడ్డు 15 మందికి ఫుడ్డు..!
దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షి 'ఔడ్‌షూర్న్' పట్టణంలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే 'ప్రపంచ ఆస్ట్రిచ్ రాజధాని' అని ఈ పట్టణానికి పేరు.

2 కిలోల బరువుండే ఉష్ట్రపక్షి అదేనండి ఆస్ట్రిచ్ బర్డ్ గుడ్డు భారీగా ఉండి పగలగొట్టాలంటే కూడా చాలా కష్టం. ఒక్క గుడ్డుతో చేసిన వంటకాన్ని దాదాపు 15 మంది వరకు తినొచ్చట. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షి 'ఔడ్‌షూర్న్' పట్టణంలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే 'ప్రపంచ ఆస్ట్రిచ్ రాజధాని' అని ఈ పట్టణానికి పేరు.

ఇక ఈ పక్షి గుడ్డు 2 కిలోల బరువు ఉంటుంది. ఉడికించాలంటే కూడా దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఇందులో కోడి గుడ్డు కంటే ఎక్కువ స్థాయిలో కాల్షియం, ఇనుము మరియు విటమిన్ ఎ కలిగి ఉంటాయి. కొవ్వు మాత్రం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది అత్యంత బలవర్థకమైన, పుష్టికరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు.

సారా రైనీ అనే మహిళ ఈ గుడ్డుతో రకరకాల వంటకాలు తయారు చేస్తూ భోజన ప్రియులను అలరిస్తున్నారు. లండన్‌లోని ఓ రెస్టారెంట్లో ఉదయం అల్పాహారంగా ఈ గుడ్డుతో చేసిన వంటలను ఉంచుతారట. ఉష్ట్రపక్షి గుడ్లలో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, జింక్, మాంగనీస్ మరియు సెలీనియం ఉంటాయి. ఎ లైఫ్ ఆఫ్ హెరిటేజ్ ప్రకారం , ఒక ఉష్ట్రపక్షి గుడ్డు కోడి గుడ్డు కంటే కొద్దిగా తియ్యగా ఉంటుంది.

ఈ గుడ్డులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. అవసరమైన అమైనో ఆమ్లాలన్నింటినీ కలిగి ఉంటుంది. ఇంకా ఈ గుడ్డులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైనవి. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. కంటి చూపుకు ఉపయోగపడతాయి. ఒక ఉష్ట్రపక్షి గుడ్డులో సుమారు 2000 కేలరీలు, 100 గ్రా కొవ్వు మరియు 235 గ్రా ప్రోటీన్లు ఉన్నాయి.

భారీ సైజులో ఉండే ఉష్టపక్షి గుడ్డు 28 పెద్ద కోడి గుడ్లను కలిపితే ఎంత ఉంటుందో ఈ పక్షి గుడ్డు అంత ఉంటుంది. ఒక కోడి గుడ్డులోని కొలెస్ట్రాల్ కంటెంట్‌తో పోల్చినప్పుడు ఉష్ట్రపక్షి గుడ్డులో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది. సాధారణంగా మహిళలకు రోజుకు 1,600 నుండి 2,400 కేలరీలు అవసరమైతే పురుషులకు రోజుకు 2,000 నుండి 3,000 కేలరీలు అవసరమవుతాయి. ఉష్ట్రపక్షి గుడ్డులో ఉండే కేలరీలు అపారమైనవి.

Tags

Read MoreRead Less
Next Story