North Korea: వైట్‌హౌజ్, పెంట‌గాన్ ఫోటోలు తీసిన ఉత్త‌ర కొరియా శాటిలైట్

North Korea: వైట్‌హౌజ్, పెంట‌గాన్ ఫోటోలు తీసిన ఉత్త‌ర కొరియా శాటిలైట్
ఉత్తర కొరియా సంచలన ప్రకటన

అమెరికాకు చెందిన శ్వేత సౌధం, పెంట‌గాన్‌, నౌకాద‌ళ కేంద్రాల‌ను ఫోటో తీసిన‌ట్లు ఉత్త‌ర కొరియా ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల త‌మ దేశం ప్ర‌యోగించిన నిఘా శాటిలైట్ ఆ ఫోటోలు తీసిన‌ట్లు చెప్పింది. గ‌త వార‌మే ఉత్త‌ర కొరియా రిక‌న్నైసెన్స్ ప్రోబ్ అనే ఉప‌గ్ర‌హాన్ని లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా కేంద్రాల‌కు చెందిన కొత్త ఫోటోల‌ను దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా చూసిన‌ట్లు ఆ దేశ మీడియా వెల్ల‌డించింది. రోమ్ న‌గ‌రం, అండ‌ర్స‌న్ ఎయిర్ ఫోర్స్ బేస్‌, పెర‌ల్ హార్బ‌ర్‌, కార్ల్ విన్స‌న్ ఎయిర్‌క్రాఫ్ట్ కేరీర్‌కు చెందిన ఫోటోల‌ను కూడా కిమ్ త‌ల‌కించారు.

డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి రిక‌న్నైసెన్స్ మిష‌న్ త‌న ప‌ని ప్రారంభిస్తుంద‌ని ఉత్త‌ర కొరియా పేర్కొన్న‌ది. శాటిలైట్ ఫైన్ ట్యూనింగ్ జ‌రుగుతున్న‌ట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే త‌మ శాటిలైట్ తీసిన చిత్రాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌ర కొరియా బ‌యిటి ప్ర‌పంచానికి విడుద‌ల చేయ‌లేదు.


కొత్త గూఢచారి ఉపగ్రహం గురించి ఉత్తర కొరియా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉత్తర కొరియా ఈ నెలలో కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కొత్త గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్,యూఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలను తీసింది. ఉత్తర కొరియా గత వారం అంతరిక్షంలోకి ప్రయోగించిన తన నిఘా ప్రోబ్‌ని ఉపయోగించి ఫోటోలు తీసినట్లు నార్త్ కొరియా ప్రకటించింది.

రోమ్, గువామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, పెరల్ హార్బర్, యూఎస్ నేవీకి చెందిన కార్ల్ విన్సన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఫోటోలతో పాటు తాజా చిత్రాలను కిమ్ జోంగ్ ఉన్ చూశారని నార్త్ కొరియా రాష్ట్ర అధికారిక మీడియా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story