అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం

జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి రోజున మహాత్ముడికి అమెరికాలో ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దావిస్ నగరంలోని సెంట్రల్ పార్కులో ఉన్న 6 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా బేస్ మెంట్ నుంచి తొలగించివేశారు.
అయితే ఆ విగ్రహాన్ని అక్కడినుంచి తొలిగించి... దీన్ని మళ్ళీ బాగు చేస్తామని డేవిస్ సిటీ కౌన్సిలర్ ల్యుకాస్ ఫ్రెరిచ్ తెలిపారు. కాగా దీనిపై భారత అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటు నాలుగేళ్ల కిందట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా పంపింది.
On 28 Jan'21, Mahatma Gandhi statue at Central Park in City of Davis, California was vandalised by unknown persons. Statue was a gift by Govt of India in '16. The Govt strongly condemns this malicious & despicable act against a universally respected icon of peace & justice: MEA pic.twitter.com/vEy0I33gpV
— ANI (@ANI) January 30, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com