Chile Forest Fires: | చిలీ ఫారెస్ట్ లోచల్లారని మంటలు

Chile Forest Fires: | చిలీ ఫారెస్ట్ లోచల్లారని  మంటలు
X
116 మంది మరణం.. భారీగా ఆస్తి నష్టం

అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ధాటికి దక్షిణ అమెరికా దేశం చిలీ గత కొన్ని రోజులుగా అతలాకుతలమౌతోంది. 8 వేల హెక్టార్లలో అడవి కాలి బూడిదవగా...మృతుల సంఖ్య 112కి చేరింది. వేలాది మంది గాయపడ్డారు. 3 నుంచి 6 వేల ఇళ్లు దావాగ్నికి దెబ్బతిన్నాయి. వందలాది మంది నిరాశ్రయులైయ్యారు. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అత్యవసర సిబ్బంది సహా సైన్యం కూడా సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది.

కొన్ని రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న దావాగ్ని ఇంకా చల్లారలేదు. ఇప్పటివరకు 112 మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 1,600 మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు.3 నుంచి 6 వేల ఇళ్లపై దావాగ్ని ప్రభావం పడిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దావాగ్ని కారణంగా ప్రభావితమైన నగరాల్లో విధించిన కర్ఫ్యూను అధికారులు పొడిగించారు. దగ్ధమైన ఇళ్లలో సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చేపడుతున్నారని చెప్పారు. గాయాలతో ఆస్పత్రుల్లో చేరినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు వైద్య విద్యార్థులనూ ఆరోగ్య సేవల కోసం అధికారులు రంగంలోకి దించారు. అత్యవసర సిబ్బందితో పాటు సైనికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.


బీచ్‌ రిసార్టులకు ప్రఖ్యాతిగాంచిన వియా డెల్‌ మార్‌ పట్టణంలో మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్‌ గార్డెన్‌ కాలిబూడిదైంది. 30 వేల మంది ప్రజలు నివసించే ఈ పట్టణంలో 200 మంది ఆచూకీ గల్లంతైంది. ఆ పట్టణం సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగగా అక్కడికి వెళ్లడమే కష్టంగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం, వేగవంతమైన గాలుల కారణంగా దావాగ్నిని నిలువరించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 8 వేల హెక్టార్లలో అడవి అగ్నికి ఆహుతైంది. దావాగ్ని చెలరేగిన ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దని చిలీ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

గత రెండు నెలలుగా ఎల్‌నినో కారణంగా దక్షిణ అమెరికా పశ్చిమ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరవు పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. సెంట్రల్‌ చిలీలో వారంపాటు రికార్డుస్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా దావాగ్ని చెలరేగింది

Tags

Next Story