Russian Soldiers: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 రష్యన్ సైనికులు మృతి

Russian Soldiers:  ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 రష్యన్ సైనికులు మృతి
యుద్ధం ప్రారంభ‌మైన రెండో సంవ‌త్స‌రం సైనికుల మ‌ర‌ణాలే ఎక్కువ‌

ఉక్రెయిన్‌తో జ‌రిగిన యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 50 వేల మంది ర‌ష్యా సైనికులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభ‌మైన రెండో సంవ‌త్స‌రం.. ర‌ష్యా సైనికుల మ‌ర‌ణాల సంఖ్య‌.. తొలి సంవ‌త్స‌రంతో పోలిస్తే 25 శాతం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థతో పాటు మ‌రికొన్ని గ్రూపులు నిర్వ‌హించిన స‌ర్వే ఆధారంగా ఈ విష‌యం తెలిసింది. 2022 ఫిబ్ర‌వ‌రి నుంచి చోటుచేసుకున్న మ‌ర‌ణాల‌ను ఆ సంస్థ‌లు న‌మోదు చేస్తున్నాయి. కొత్త‌గా నిర్మించిన శ్మ‌శాన‌వాటిక‌ల ద్వారా సైనికుల‌ను గుర్తించ‌డం జ‌రిగింది. ఉక్రెయిన్‌తో జ‌రిగిన వార్‌లో రెండో ఏడాది సుమారు 27, 300 మంది సైనికులు మృతిచెందారు. అధికారికంగా ర‌ష్యా చెప్పిన వివ‌రాల‌తో పోలిస్తే, మ‌ర‌ణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఆక్ర‌మిత డోన‌స్కీ, లుహాన్స్కీల్లో జ‌రిగిన మ‌ర‌ణాల‌ను దీంట్లో లెక్కించ‌లేదు. ర‌ష్యాతో జ‌రుగుతున్న యుద్ధంలో 31వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందిన‌ట్లు అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఇటీవ‌ల తెలిపారు.

యుద్ధం రెండో ఏడాదిలో 27,300 కంటే ఎక్కువ మంది రష్యన్ సైనికులు మరణించారని చెప్పారు. ఇది మొదటి సంవత్సరం కన్నా ఎక్కువ. BBC రష్యన్, మీడియాజోనా మరియు వాలంటీర్లు ఫిబ్రవరి 2022 నుండి ఈ మరణాలను లెక్కిస్తున్నారు. మరణాల లెక్కను తేల్చడానికి అలాగే కొత్త సమాధుల సంఖ్యను అంచనా వేయడానికి రష్యన్ శ్మశానవాటికలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ యుద్ధంలో 50,000 మంది రష్యా సైనికులు మరణించారని నివేదిక తెలుపుతోంది. అయితే ఇది సెప్టెంబర్ 2022లో రష్యా అందించిన అధికార మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ. ఈ లెక్కల్లో ఉక్రెయిన్ లోని డోనెట్స్స్, లూగాన్స్క్ మిలీషియా మరణాలు లేవు.

ఉక్రెయిన్ ఫిబ్రవరిలో 31,000 మంది సైనికులను కోల్పోయిందని, అయితే ఈ సంఖ్య నిజమైన మరణాల కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. జనవరి 2023లో రష్యా డోనెట్స్క్ దాడిలో, బఖ్‌‌ముత్ దాడిలో ఎక్కువ మంది సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై‘ ప్రత్యేక సైనిక చర్య’ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య రక్తపాతం చోటు చేసుకుంటోంది.

Tags

Next Story