Israel: సేఫ్ జోన్ లోనూ బాంబు దాడులు చేస్తున్న ఇజ్రాయెల్

Israel: సేఫ్ జోన్ లోనూ బాంబు దాడులు చేస్తున్న  ఇజ్రాయెల్
X
60 మంది పాలస్తీనా ప్రజలు మృతి

హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వేటాడుతున్న ఇజ్రాయెల్... తాజాగా సేఫ్ జోన్ లోనూ బాంబుల వర్షం కురిపించింది. సౌత్ గాజా నగరం ఖాన్ యూనిస్ శివారు ప్రాంతం మువాసీలో ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 17 మంది మృతి చెందారు. హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన తర్వాత వేలాది మంది శరణార్థులు మువాసీ ప్రాంతానికి తరలివచ్చారు. ఈ ప్రాంతాన్ని ఇటీవలే సేఫ్ జోన్ల జాబితాలో చేర్చారు. అయితే, ఇజ్రాయెల్ అవేవీ పట్టించుకోకుండా, హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించడమే లక్ష్యంగా దాడులు చేపట్టింది. మొత్తమ్మీద వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కొన్ని గంటల వ్యవధిలోనే 60 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. ఈ మేరకు గాజా హెల్త్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.

హమాస్‌ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజా పై మరోసారి ఇజ్రాయెల్‌ మరోసారి విరుచుకుపడింది. దీంతో ఒక్కరాత్రే 60 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారు. సురక్షిత జోన్‌గా ప్రకటించిన ప్రాంతాలనూ వదల్లేదు. ఇక్కడా 17 మంది పాలస్తీనీయన్లు చనిపోయినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది.

దక్షిణ గాజా నగరం ఖాన్‌ యూనిస్‌ శివారులోని మువాసీ ప్రాంతం ప్రాంతాన్ని ‘సేఫ్‌ జోన్‌’గా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్‌ దాడులతో ఇక్కడ ఆశ్రయం పొందేందుకు వచ్చిన వేలాది మంది శరణార్థులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఐడీఎఫ్‌ కూడా ఈ ప్రాంతాన్ని తమ ‘సేఫ్‌ జోన్‌’ జాబితాలో చేర్చినట్లు ఇటీవల ప్రకటించింది. నిరాశ్రయులు ఇక్కడే ఉండొచ్చని సూచించింది. ఓ గ్యాస్‌ స్టేషన్‌కు సమీపంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపైనా భీకర దాడులు జరిపింది.

సేఫ్‌ జోన్‌లోనే 17 మంది మృతి చెందినట్లు ఖాన్‌ యూనిస్‌లోని నాజర్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఒక్క రాత్రిలో జరిగిన దాడుల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 60కి చేరుకున్నట్లు గాజా ఆరోగ్య విభాగం పేర్కొంది. ఇదే ప్రాంతంలో శనివారం జరిపిన దాడిలో 90 మంది పాలస్తీనీయన్లు చనిపోగా.. 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఇలా సురక్షిత ప్రాంతంలో దాడులు జరపడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story