PAK : పాకిస్థాన్ లో డాక్టర్ హత్య

PAK : పాకిస్థాన్ లో  డాక్టర్ హత్య
ధరమ్ వీర్ హైదరాబాద్ లోని అతని ఇంట్లో మరో స్నేహితుడితో కలిసి హోళీ ఆడుతున్నాడు

హోళీ సంబురాలు జరుగుతున్న వేళ పాకిస్థాలో ఓ హిందూ డాక్టర్ ను హత్యకు గురయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధి నిపుణుడిని) ధరమ్ దేవ్ రాతీని (60) అతని డ్రైవర్ హనీఫ్ లెఘారీ హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ధరమ్ వీర్ హైదరాబాద్ లోని అతని ఇంట్లో మరో స్నేహితుడితో కలిసి హోళీ ఆడుతున్నాడు. హోళీ ఆడిన తర్వాత అతని స్నేహితుడు వెళ్లిన కొద్దిసేపటికే ఆగ్రహంతో ఊగిపోయిన హనీఫ్ కిచెన్ లోని కత్తితో దరమ్ వీర్ మెడపై దాడిచేశాడు. రక్తపు మడుగులో డాక్టర్ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. హనీఫ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వంటమనిషి దిలీప్ ఠాకూర్ కు ఈ ఘటనలో గాయాలయ్యాయి.

పోలీసులకు దిలీప్ సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్ ను హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ధరమ్ వీర్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ధరమ్ వీర్ కు డ్రైవర్ హనీఫ్ కు గొడవ జరిగిందని కోపంలో హనీఫ్ వంటగదిలోని చాకుతో డాక్టర్ ను చంపేశాడని దిలీప్ ఠాకూర్ పోలీసులకు తెలిపాడు. అనంతరం డాక్టర్ కారులోనే హనీఫ్ పారిపోయాడని చెప్పాడు.

నిందితుడు హనీఫ్ ను ఖైర్ పూర్ లోని అతని ఇంట్లోనే బుధవారం అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్ ధరమ్ దేవ్ హైదరాబాద్ లో ఫేమస్ చర్మవ్యాధి నిపుణుడని పోలీసులు తెలిపారు. నిందితుడిని 24గంటల్లో అరెస్ట్ చేసినందుకు మైనారిటీ వ్యవహారాల మంత్రి జియాన్ చంద్ ఎస్సారానీ పోలీసులను ప్రశంసించారు. హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) మహిళా విభాగం చీఫ్ ఫర్యాల్ తల్పూర్ హత్యను ఖండించారు. జరిగిన ఘటన బాధను కలిగించిందని అన్నారు. డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు.

ధరమ్ వీర్ రెండు సంవత్సరాల క్రితమే రిటైర్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య, పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారని మరికొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లేందుకు సిద్దమవగా అంతలోనే హత్యకు గురయ్యరని చెప్పారు.



Tags

Read MoreRead Less
Next Story