Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ‘‘ఫీల్డ్ మార్షల్’’గా పదోన్నతి..

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ‘‘ఫీల్డ్ మార్షల్’’గా పదోన్నతి..
X
ఆపరేషన్ సిందూర్ తో దెబ్బతిన్నా విజయం మాదే అంటూ ప్రచారం..

పాకిస్తార్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత సైనిక హోదాతో సత్కరించింది. ఆసిమ్ మునీర్‌కు ‘‘ఫీల్డ్ మార్షల్’’గా ప్రమోషన్ లభించింది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో, సాయుధ దళాల్లో అద్భుతంగా ఆపరేషన్స్ నిర్వహించిన వారికి మాత్రమే ఇచ్చే గౌరవ పదోన్నతి. ప్రధాన మంత్రి షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆర్మీ చీఫ్‌కి పదోన్నతి కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ప్రమోషన్ ఇవ్వడం గమనార్హం.

పాకిస్తాన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’లో ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ, విజయం మాదే అని ఆ దేశంలో ప్రచారం చేసుకుంటున్నాయి. భారత్‌పై విజయం సాధించామని ఏకంగా విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు చేసుకుంటున్నారు. పాక్ ప్రధాని షరీఫ్‌తో పాటు ఆర్మీ చీఫ్‌లు ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రజానీకాన్ని వీరంతా బకరాలను చేస్తున్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల్ని బలి తీసుకున్న తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. 09 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత పాక్ ఆర్మీ దాడులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన కీలకమైన 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. ముఖ్యంగా, పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న రావాల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భారత్ దాడులు చేసింది. ఇంత జరిగినా కూడా, భారత్‌పై విజయం సాధించామని చెప్పుకోవడం పాకిస్తాన్‌కే చెల్లుతోంది.

Tags

Next Story