Pakistan : పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది భార్యకు స్థానం

Pakistan : పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది భార్యకు స్థానం

ఓ ఉగ్రవాది భార్యకు పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ తన మంత్రివర్గంలో భారత జైలులో ఉన్న ఉగ్రవాది, జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ భార్య మిషాల్‌ హుస్సేన్‌ మాలిక్‌ను చేర్చుకున్నారు. ఆపద్ధర్మ ప్రధాని కాకర్‌కు ఆమె ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించనున్నారు. మానవ హక్కులు, మహిళా సాధికారిత తదితర అంశాలలో ఆమె సలహాదారుగా ఉంటారని పాక్‌ వర్గాలు తెలిపాయి. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జేకేఎల్‌ఎఫ్‌ కమాండర్‌ యాసిన్‌ మాలిక్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు దోషిగా నిర్ధారించింది. యావజ్జీవ శిక్ష పడటంతో ఆయన ఢిల్లీలోని తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిద్దరికీ 2009లో వివాహమైంది.

కొత్తగా నియమితులైన న తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ కేబినెట్ సభ్యులతో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ గురువారం ప్రమాణం చేయించారు. పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం, జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు ఇంకో 30 రోజులు కలిపి 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం 2023 చివర్లో కానీ 2024 ప్రారంభంలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా.

ప్రస్తుతం పాక్ అప్పుల్లో కూరుకుపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతోంది. కనీసం తినడానికి గోధుమ పిండి దొరక్క, పెట్రోల్, డిజీల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి.. ఆదాయ మార్గాలు మూసుకుపోయి దిక్కులేని దేశంగా తయారయింది. వివిధ దేశాలు, ప్రపంచ బ్యాంకు వద్ద తీసుకున్న అప్పును చెల్లించలేక కొత్త అప్పులు ఎలా తీసుకోవాలో తెలియక దేశ పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయి.

ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, మరోవైపు ఖురాన్‌ను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో క్రైస్తవులపై తాజాగా జరిగిన దాడులు, చర్చిల దహనం.. ఇలాంటి పరిస్థితుల్లో, శాంతిభద్రతలు పరిరక్షణలో విఫలమైతే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story